Begin typing your search above and press return to search.

హిట్ 2 లో స్పెష‌ల్ స‌ర్ ప్రైజ్ ప్లాన్ చేశారా?

By:  Tupaki Desk   |   27 Jun 2022 2:30 AM GMT
హిట్ 2 లో స్పెష‌ల్ స‌ర్ ప్రైజ్ ప్లాన్ చేశారా?
X
మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ న‌టించిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ డ్రామా `హిట్ : ద ఫ‌స్ట్ కేస్‌`. శైలేష్ కొల‌ను డైరెక్ట్ చేసిన ఈ మూవీని హీరో నేచుర‌ల్ స్టార్ నాని వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్ పై నిర్మించారు. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ మూవీ సెన్సేష‌న‌ల్ హిట్ గా నిలిచి విశ్వ‌క్ సేన్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. మేక‌ర్ గా హీరో నానికి గుడ్ మేక‌ర్ గా గుర్తింపుని అందించింది. ప్ర‌స్తుతం ఈ మూవీకి హిందీలో కీమేక్ ని చేస్తున్నారు. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఇదిలా వుంటే `హిట్ : ద ఫ‌స్ట్ కేస్‌` కి సీక్వెల్ గా `హిట్ : ద సెకండ్‌ కేస్‌` పేరుతో ఓ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సూప‌ర్ హిట్ ల‌ని సొంతం చేసుకుంటూ హీరోగా మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంటున్న అడివి శేష్ ఈ సీక్వెల్ లో న‌టిస్తున్నాడు. `మేజ‌ర్` మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ ని ద‌క్కించుకున్న అడివి శేష్ మంచా జోష్ తో చేస్తున్న ఈ మూవీ త్వ‌రలోనే థియేట‌ర్లోలోకి రాబోతోంది.

మీనాక్షీ చౌద‌రి హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ఫ‌స్ట్ కేస్ ని తెలంగాణ నేపథ్యంలో తెర‌కెక్కిస్తే దీనికి సీక్వెల్ గా రూపొందుతున్న `హిట్ : ద‌సెకండ్ కేస్ ` ఏపీలోని వైజాగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తున్నారు. జూలై 29న ఈ మూవీని రిలీజ్ చేయాల‌ని హీరో నాని ప్లాన్ చేస్తున్నారు. భాను చంద‌ర్‌, రావు ర‌మేష్‌, పోసాని కృష్ణ ముర‌ళి, త‌నికెళ్ల భ‌ర‌ణి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఇదిలా వుంటే ఈ మూవీలో ఫ‌స్ట్ పార్ట్ కి మించి సెకండ్ పార్ట్ లో మ‌రింత స‌ర్ ప్రైజ్ ని ప్లాన్ చేశార‌ట‌. ఈ మూవీలో హీరో నాని స‌ర్ ప్రైజ్ క్యారెక్ట‌ర్ చేస్తున్నార‌ని తెలిసింది. ఇప్ప‌టికే హీరో నాని త‌న పాత్ర‌కు సంబంధించిన షూటింగ్ ని కూడా పూర్తి చేశార‌ని, త్వ‌ర‌లోనే చిత్ర బృందం ఈ స‌ర్ ప్రైజ్ న్యూస్ ని అధికారికంగా బ‌య‌ట‌పెట్ట‌నున్నార‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల ఈ మూవీ ని జూలై 29న విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో రిలీజ్ ని మ‌రోసారి వాయిదా వేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే న్యూ రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది.