వర్మ సింగ్ ల మధ్య రీమేక్ పోటీ

Sun May 19 2019 12:41:17 GMT+0530 (IST)

Aditya Varma Vs Kabir Singh movies

టాలీవుడ్ లో ఓ కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయిన అర్జున్ రెడ్డిని రీమేక్ చేయడం ఎంత కష్టమో బాలా లాంటి దిగ్గజ దర్శకుడికి ప్రత్యక్షంగా తెలిసి వచ్చింది. ఆయన తీసిన తమిళ రీమేక్ వెర్షన్ మరీ నాసిరకంగా రావడంతో నిర్మాతలు ఫస్ట్ కాపీ రెడీ అయినా దాన్ని క్యాన్సిల్ చేసి సందీప్ వంగా అసిస్టెంట్ గిరిసాయతో మళ్ళి తీసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం కోలీవుడ్ లో సంచలనం రేపినప్పటికీ విక్రమ్ తో స్నేహం దృష్ట్యా బాలా దీని గురించి కించిత్ కూడా స్పందించకుండా సైలెంట్ అయిపోయారు.ఇప్పుడు టైటిల్ వర్మని ఆదిత్య వర్మగా రెండోసారి చేసిన ప్రయత్నం ఓ కొలిక్కి వచ్చింది. షూటింగ్ మొత్తం పూర్తయినట్టు సమాచారం. ఒరిజినల్ లోని ఫీల్ చెడిపోకుండా గిరిసాయ ఆల్మోస్ట్ ఎలాంటి మార్పులు లేకుండా యధాతధంగా తీసినట్టు చెన్నై టాక్. త్వరలో టీజర్ తో పాటు రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు

కాకతాళీయంగా హిందీ రీమేక్ కబీర్ సింగ్ కూడా విడుదలకు రెడీగా ఉంది. ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కొంచెం అటుఇటుగా తక్కువ గ్యాప్ తోనే కబీర్ సింగ్ ఆదిత్య వర్మలు రిలీజవుతున్నాయి. హిందీ వెర్షన్ సందీప్ రెడ్డి వంగా తీస్తుండగా తమిళ్ బాధ్యతలు అతని శిష్యుడు గిరిసాయ టేకప్ చేశాడు. ఇప్పుడు గురు శిష్యుల మధ్య ఈ రకంగా కూడా పోలిక వస్తుంది.

ఆల్రెడీ ఓసారి పరువు పోగొట్టుకున్న తమిళ వర్మ ఈసారైనా కొత్త దర్శకుడి చేతిలో ఎలా మలచబడ్డాడో అని తెలుగు ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు. విక్రమ్ వారసుడు ధృవ్ ని పరిచయం చేస్తూ రూపొందిన ఈ సినిమాలో హీరోని తప్ప అందరిని రీ ప్లేస్ చేసి మరీ రీ షూట్ చేయడం విశేషం