డబ్బుల కోసం యాడ్స్ తో అబద్దాలు చెప్పనంటోంది

Mon Sep 21 2020 10:15:38 GMT+0530 (IST)

Aditi Rao Hydari Talking About Commercial Ads

హిందీలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ అదితి రావు హైదరీ ఈమద్య కాలంలో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. 2018 ఏడాది సమ్మోహనం సినిమాలో సుధీర్ బాబు సినిమాలో నటించిన ఈ అమ్మడు ఆ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ తో అంతరిక్షం సినిమాలో నటించింది. అందంతో పాటు నటనలో కూడా మంచి ప్రతిభ కనబర్చే ఈ అమ్మడు తాజాగా 'వి' సినిమాలో నానికి జోడీ నటించింది. సినిమాలో ఆమె కనిపించింది కొద్ది సమయం అయినా కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఈమద్య కాలంలో చిన్న హీరోయిన్స్ కూడా లక్షల రూపాయల పారితోషికాల కోసం యాడ్స్ లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాని ఈమె మాత్రం యాడ్స్ లో నటించే విషయమై చాలా క్లారిటీగా ఉంది.ఈమెకు ముఖ్యంగా బ్యూటీ ప్రోడక్స్ కు సంబంధించిన చాలా కంపెనీల నుండి బ్రాండ్ అంబాసిడర్ గా ఆఫర్ వచ్చిందట. కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తో పలు కంపెనీలు ఈమెను అప్రోచ్ అయ్యాయట. కాని బ్యూటీ ప్రాడక్ట్స్ కు అంబాసిడర్ గా చేయడం అంటే అబద్దాలు చెప్పడమే అంటూ ఈమె అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. అందం అనేది కేవలం జీన్స్ వల్ల వస్తుంది. ఇతర ప్రాడెక్ట్స్ పెడితే వచ్చేది అందం కాదు. జీవితానికి అందమే ప్రధానం అని చెప్పడాన్ని నేను అస్సలు ఒప్పుకోను. అందుకే బ్యూటీ ప్రాడక్ట్స్ ను ప్రమోట్ చేయను అంటూ తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఈమె రెండు తమిళ మరియు రెండు హిందీ సినిమాల్లో నటిస్తుంది. తెలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.