ఫోటో స్టోరీ: కల్కి డిజైన్ లో సమ్మోహనం

Wed Oct 16 2019 17:23:09 GMT+0530 (IST)

అదితి రావు హైదరీ తెలుగులో మంచి గుర్తింపు ఉన్న భామే.  నాలుగైదేళ్ళ క్రితమే ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టిందని చాలామంది అనుకుంటారు కానీ ఈ బ్యూటీ ఫస్ట్ సినిమా మలయాళంలో 'ప్రజాపతి' (2006).  అంటే 13 ఇయర్స్ ఇండస్ట్రీ అనుకోవాలి. మణిరత్నం సినిమా 'చెలియా'.. సుధీర్ బాబు-ఇంద్రగంటి 'సమ్మోహనం' సినిమాలతో మెప్పించింది. ఇక  మిగతా మోడరన్ భామల్లాగే ఈ భామ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్. అయితే హీటు పెంచడమెలా అనే సబ్జెక్ట్ లో ఎక్కువ మార్కులు రాలేదేమో కానీ ఫోటోలు దాదాపుగా బ్యూటిఫుల్ గా ఉంటాయి. స్కిన్ షో తక్కువే.రీసెంట్ గా ముంబైలో టైమ్స్ ఫ్యాషన్ షో జరిగిన సంగతి తెలిసిందే.  ఆ ఫ్యాషన్ షోలో చాలామంది బాలీవుడ్ భామలు తమ ప్రతాపం చూపారు. అదితి కూడా కొన్ని హిందీ సినిమాల్లో నటించింది కాబట్టి ముంబై ఫ్యాషన్ షో లో తను కూడా పాల్గొంది. ఈ ఫ్యాషన్ షో నుంచి ఒక ఫోటోను అదితి తన ఇన్స్టా ఖాత ద్వారా పోస్ట్ చేసింది.   అయితే ముంబై షో కావడంతో వారికి తగ్గట్టుగా హాట్ గా కనిపించింది.  కల్కి ఫ్యాషన్ వారు డిజైన్ చేసిన ఎమరాల్డ్ గ్రీన్ లెహెంగా.. ఛోళి ధరించి హొయాలొలుకుతూ పిల్లినడక నడిచింది. ఆ క్యాట్ వాక్ దెబ్బకు అతిథులు డంగైపోయారట.  డ్రస్ అంటే డ్రస్ మాత్రమే కాకుండా మ్యాచింగ్ నెక్లెస్.. ఇయర్ రింగ్స్ తో చూపరులను కట్టిపడేసింది అదితి.

ఈ ఫోటోకు చాలామందినెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. "ప్రెట్టీ ప్రిన్సెస్".. "బ్యూటీ ఇన్ఫినిటీ ".. "రాయల్ లుక్" అంటూ కామెంట్లు పెట్టారు. ఇక అదితి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే తెలుగులో నాని సినిమా 'V' లో నటిస్తోంది.  ఈ సినిమా కాకుండా తమిళంలో 'సైకో'.. 'నాన్ రుద్రన్'.. 'తుగ్లక్ దర్బార్' సినిమాల్లో నటిస్తోంది. హిందీలో 'ది గర్ల్ ఆన్ ది ట్రైన్' లో కూడా నటిస్తోంది.