'ఆదిపురుష్' టీమ్ అక్కడ హల్ చల్ చేస్తోంది!

Mon Sep 26 2022 13:07:30 GMT+0530 (India Standard Time)

Adipurush team in special location for teaser

ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూడు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు. అందులో ఒకటి 'ఆది పురుష్'. మైథలాజికల్ డ్రామాగా రామాయణ గాథ నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.  షూటింగ్ పూర్తి చేసుకుని గత కొన్ని నెలలుగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకునే దశలో వుంది. ఈ మూవీ కోసం యావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రిలీజియన్ సెంటిమెంట్ బలంగా వీస్లున్న నేపథ్యంలో 'ఆది పురుష్' కోసం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అంతే కాకుండా ప్రభాస్ నటిస్తున్న తొలి మైథలాజికల్ మూవీ కావడం కూడా ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. వాల్మీకి రామాయణం ఆధారంగా జపనీస్ మూవీ 'రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా' స్ఫూర్తితో ఈ భారీ దృశ్య కావ్యాన్ని వెండితెరపై దర్శకుడు ఓం రౌత్ అత్యంత భారీ స్థాయిలో గ్రాఫికల్ వండర్ గా తెరకెక్కించారు. గత కొన్ని నెలలుగా ఈ మూవీ సీజీ వర్క్ జరుపుకుంటోంది. గ్రాఫిక్స్ ప్రధాన హైలైట్ గా నిలవనున్న ఈ మూవీని 3డీ ఫార్మాట్ లో రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తుండగా సీత పాత్రలో కృతిసనన్ నటిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ ఇంత వరకు రిలీజ్ చేయలేదు.

అయితే అక్టోబర్ 2న ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందు కోసం అయోధ్యలోని రామజన్మ భూమిని ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. సినిమా రిలీజ్ కు మరింత సమయం వుండటంతో ఇప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్ పై దేశ వ్యాప్తంగా బజ్ ని క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

అక్టోబర్ 2న టీజర్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారట. ఫస్ట్ లుక్ ని రాముడి జన్మస్థలం అయిన అయోధ్యలో ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాలన్నది మేకర్స్ ఆలోచనగా తెలుస్తోంది. ఇందు కోసం ఇప్పటికే ప్రభాస్ దర్శకుడు ఓం రౌత్ ఆయోధ్యలోని టెంపుల్ టౌన్ లో విహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ తరువాత కూడా టీమ్ భారీ ఈవెంట్ లని వన్ బై వన్ ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు.

ఇక అక్టోబర్ 5న చిత్ర బృందం లవ్ కుష్ రామ్ లీలాలో ప్రత్యేకంగా హాజరు కాబోతోంది. అంతే కాకుండా దసరా వేడుకల్లో రావణ దహనంలో ప్రభాస్ కూడా పాల్గొనబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలోని ఇతర పాత్రలలో సన్నీ సింగ్ దేవ్ దత్త నాగే వత్సల్ సేథ్ సొనాల్ చౌహాన్ తదితరులు నటిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.