యూవీ చేతికి ఆదిపురుష్ హక్కులు

Sun Aug 14 2022 16:06:12 GMT+0530 (India Standard Time)

Adipurush rights to UV Creations

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా పనులన్నీ చివరి దశకు చేరుకున్న విషయం తెలిసిందే. సినిమా షూటింగ్ ఇదివరకే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా బిజీగా ఉన్నారు. అయితే షూటింగ్ పూర్తయినా కూడా ఇంతవరకు ఒక్క ఫస్ట్ లుక్ పోస్ట్ కూడా విడుదల చేయకపోవడంపై అభిమానులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద సినిమాకు కనీసం ఒక పోస్టర్ కూడా విడుదల చేయడానికి సమయం దొరకడం లేదా అని ఫ్యాన్స్ అయితే చాలా కోపంగా ఉన్నారు.అసలు చిత్ర యూనిట్ సభ్యులు ఎందుకు ఇలా చేస్తోంది అనే విషయంలో కూడా ఎవరికి క్లారిటీ రావడం లేదు. సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ అని చెప్పిన తరువాత టీజర్ అయినా విడుదల కావాల్సింది. కానీ ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా పనులన్నీ కొనసాగిస్తూ ఉండడం అతిపెద్ద సస్పెన్స్ గా మారింది. ఇక సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది.

చిత్ర నిర్మాణ సంస్థలు ఇదివరకే కొన్ని రాష్ట్రాల సంబంధించిన హక్కులను మంచి ధరకు అమ్మినట్లు సమాచారం. ఇక తెలుగులో అయితే ఈ సినిమా హక్కులను UV క్రియేషన్స్ దక్కించుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ స్నేహితులైన వంశీ ప్రమోద్ ఇటీవల ఆదిపురుష్ నిర్మాతలతో మాట్లాడి దాదాపు 100 కోట్లకు డీల్ ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలి అంటే యూవీ క్రియేషన్స్ తోనే సాధ్యమవుతుంది అని ప్రభాస్ ఆదిపురుష్ నిర్మాతలకు సలహా ఇవ్వచ్చునట్లు సమాచారం.

ఇక దాదాపు ప్రభాస్ ప్రతి సినిమాకు కూడా యూవి క్రియేషన్స్ అయితే ఏదో ఒక విధంగా కాంబినేషన్ కొనసాగిస్తుంది. కానీ అభిమానులు మాత్రం ఈ విషయంలో పెద్దగా సంతృప్తిగా లేరు. UV క్రియేషన్స్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని కూడా సలహాలు ఇస్తున్నారు. ప్రభాస్ రెండుసార్లు అవకాశాలు ఇస్తే సాహో ఆదిపురుష్ సినిమాలకు పెద్దగా జాగ్రత్తలు లేకుండా తెరపైకి తీసుకురావడం అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. మరి  ఆదిపురష్ సినిమా తో అయినా యూవి క్రియేషన్స్ మళ్లీ ట్రాక్ లోకి వస్తుందో లేదో చూడాలి.