'ఆదిపురుష్' మరో అఫిషియల్ అనౌన్స్ మెంట్

Thu Jun 10 2021 16:00:01 GMT+0530 (IST)

'Adipurush' is another official announcement

ప్రభాస్ బాలీవుడ్ మూవీ ఆదిపురుష్ పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దాదాపుగా రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా కు బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. రామాయనం ఇతి వృత్తంలో రూపొందుతున్న ఈ సినిమా కు సంగీతాన్ని ఎవరు అందిస్తారో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఓమ్ రౌమ్ ఈ సినిమా సంగీత బాధ్యతలను సచేత్ - పరంపర లకు అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఓమ్ రౌత్ గత చిత్రం తానాజీ చిత్రంలోని రెండు పాటలకు ఈ సంగీత దర్శకద్వయం ట్యూన్స్ ను అందించారు. ఆ పాటలకు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో ఆదిపురుష్ పూర్తి బాధ్యతను వారికే అప్పగించారని తెలుస్తోంది.సచేత్ మరియు పరంపర లు బాలీవుడ్ లో ఈమద్య కాలంలో బిజీ మ్యూజీషియన్స్ గా పేరు దక్కించుకున్నారు. యూత్ ఫుల్ ట్యూన్స్ ఇస్తారనే పేరు ఉన్న వీరిద్దరు ఈ ఆఫర్ ను దక్కించుకోవడంతో వీరి పేరు మరింతగా మారు మ్రోగిపోతుంది. ఇతిహాస కథ అవ్వడం వల్ల పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ విషయంలో ప్రత్యేక శ్రద్ద అవసరం. అలాంటి ఈ సినిమా కు ఈ యంగ్ సంగీత దర్శకులను తీసుకోవడంలో ఓమ్ రౌత్ ఉద్దేశ్యం ఏంటో అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రభాస్ కు జోడీగా ఈ సినిమా లో కృతి సనన్ నటిస్తున్న విషయం తెల్సిందే. రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా రావణుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మోషన్ గ్రాఫిక్స్ తో ఈ సినిమా విజువల్ వండర్ గా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తో ప్రభాస్ బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువ అవుతాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది.