`ఆదిపురుష్ 3డి` బృందం హైదరాబాద్ కు మకాం షిఫ్ట్

Fri May 07 2021 14:00:01 GMT+0530 (IST)

Adipurush Interesting update

సెకండ్ వేవ్ ప్రభావం అంతా మార్చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ టాలీవుడ్ లో షూటింగులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కానీ ఇంకా ఇలా ఎంతకాలం? కోవిడ్ కేసుల పెరుగుదల కారణంగా ప్రభాస్ `ఆదిపురుష్ 3డి` షూటింగ్ గత నెలలో ఆగిపోయింది. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం సినిమా షూటింగ్ లపై ఆంక్షలు విధించింది.తాజా సమాచారం మేరకు.. టీమ్ ఆదిపురుష్ అతి త్వరలో హైదరాబాద్ కు మకాం మార్చనున్నారు. కఠినమైన కోవిడ్ ప్రోటోకాల్ తో హైదరాబాద్ లో ప్రత్యేకంగా రూపొందించిన ఇండోర్ సెట్ లో షూట్ ను తిరిగి ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారు. మొత్తం ప్రధాన తారాగణం సాంకేతిక సిబ్బంది మే రెండవ వారం నాటికి హైదరాబాద్ కు షిఫ్టవుతారని తెలిసింది. ఇక్కడికి వచ్చాక షూటింగ్ వెంటనే ప్రారంభమవుతుంది. ఈ కీలక షెడ్యూల్ లో ప్రభాస్.. కృతి సనోన్ మిగిలిన తారాగణం పాల్గొంటారు.

ప్రభాస్ ఈ సినిమాతో పాటు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ లో నటిస్తున్నారు. అటుపై నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ మూవీని ప్రారంభించాల్సి ఉంది. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావంతో ఇవన్నీ ఆలస్యం కానున్నాయి.