ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ట్రీట్...రాముడొచ్చేసాడు

Fri Sep 30 2022 10:23:59 GMT+0530 (India Standard Time)

Adipurush First Look: Prabhas As Lord Rama

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ `ఆదిపురుష్` అప్ డేట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాభిమానులు ఎంతటి ఎగ్జైట మెంట్ తో ఎదురుచూస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు.  ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడి ఆహార్యంలో ఎలా ఉంటారు?  రియల్ రాముడి ఆహార్యంలో డార్లింగ్ ఒదిగిపోతాడా?  లేదా? అని చాలా సందేహాలు తెరపైకి వచ్చాయి.రాముడి గెటప్ లో ఫ్యాన్ మేడ్ పోస్టర్లు అంతకంతకు అంచనాలు పెంచేసాయి. ఫ్యాన్ మేడ్ నే ఈ రేంజ్ లో ఉంటే దర్శకుడు ఓంరౌత్ ప్రభాస్ ని రాముడిగా ఇంకెంత అందంగా చూపిస్తారు? అంటూ  ఒకటే ఎగ్జైట్ మెంట్ అభిమానులు నెలకొంది. తాజాగా వాటన్నింటికి  బధులిస్తూ కొద్ది సేపటి క్రితమే ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని  మేకర్స్ రిలీజ్ చేసారు.

టీజర్ రిలీజ్ కి ఇంకా రెండు రోజులు సమయం  ఉండగానే అభిమానులకు ఓం రౌత్ టీజర్ రిలీజ్ తో  సర్ ప్రైజ్ ట్రీట్ ఇచ్చారు. ప్రభాస్ రాముడి ఆహార్యంలో ఒదిగిపోయాడు. పొడవాటి  జుత్తు...చేతికి రుద్రాక్షలు ధరించి  రాముడిగా..ఆకాశానికి విల్లు ఎక్కుపెట్టి పవర్ పుల్ లుక్ లో ఆద్యంతం ఆకట్టుకుంటున్నాడు.  అచ్చంగా రాముడే దిగివచ్చాడా? అన్నంతగా ప్రభాస్ లుక్ అలరిస్తుంది.

రాముడి ఆహార్యం కోసం వినియోగించిన కాస్ట్యూమ్స్..ఆనాటి అలంకరణ ప్రతీది గెటప్ ని మ్యాచ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ అభిమానులు సహా సో షల్ మీడియాలో వైరల్ గా మారింది.  `రాముడొచ్చాడు` అంటూ అభిమానులు కామెంట్లు పోస్ట్ చేసి షేర్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ కి మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో పోస్టర్ నెట్టింట వాయు వేగంతో దూసుకుపోతుంది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దర్శకుడు ఓ రౌంత్ తమ ప్రయాణంలో భాగం కండి అని కోరారు. ` మా ఈ అద్భుతమైన ప్రయాణంలో మీరు భాగం కండి. ఉత్తరప్రదేశ్ రాష్ర్టం ఆయోధ్యలో సరయు నది ఒడ్డున జరగనున్న ఆదిపురుష్ టీజర్ లాంచ్ లో పాల్గొనండి. అక్టోబర్ 2 రాత్రి 7.11 గంటలకు టీజర్ విడుదల చేస్తున్నాం` అని రాసుకొచ్చారు.

`ఆదిపురుష్` చిత్రాన్ని రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ రాముడిగా.. ఆయనకు జోడీగా కృతిసనన్ సీత పాత్రలో నటిస్తున్నారు. రావణాసురిడి పాత్రలో సైఫ్ అలీఖాన్..లక్ష్మణుడి పాత్రలో సన్నీసింగ్ నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.  వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.