Begin typing your search above and press return to search.

శర్వా - రష్మికల 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' రిలీజ్ డేట్ ఫిక్స్..!

By:  Tupaki Desk   |   28 Jan 2022 2:00 PM GMT
శర్వా - రష్మికల ఆడవాళ్ళు మీకు జోహార్లు రిలీజ్ డేట్ ఫిక్స్..!
X
యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం తిరుమల కిషోర్ దర్శకత్వంలో నటిస్తున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ''ఆడవాళ్ళు మీకు జోహార్లు''. ఇందులో శర్వా సరసన లక్కీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఒక పాట మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. త్వరలో ఈ పాట చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే మేకర్స్ తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌ కి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు.

'ఆడవాళ్ళు మీకు జోహార్లు' చిత్రాన్ని 2022 ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు శర్వానంద్ - రష్మికలు ఉన్న ఓ పోస్టర్ ని వదిలారు. రిలీజ్ డేట్ ని లాక్ చేసిన మేకర్స్ త్వరలో ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టనున్నారు. అయితే ఫిబ్రవరి 25న ఆలియా భట్ నటించిన 'గంగుబాయి' సినిమా రానుంది. అదే రోజున 'భీమ్లా నాయక్' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆ మధ్య ప్రకటించారు. మరి పరిస్థితులను బట్టి మరోసారి వాయిదా వేస్తారేమో చూడాలి.

కాగా, 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమా కోసం శర్వానంద్ - రష్మిక మందన్న - తిరుమల కిషోర్‌ మొదటిసారి కలిసి వర్క్ చేస్తున్నారు. ఇందులో శర్వా పక్కింటి కుర్రాడి పాత్రలో నటిస్తుండగా.. రష్మిక మందన్న చలాకీ అమ్మాయి పాత్రలో కనిపించనుంది. సినిమాలో మహిళా పాత్రలకు ఉన్న ప్రాధాన్యత ఏంటో టైటిల్‌ తోనే అర్థం అవుతుంది. ఖుష్బు - రాధిక శరత్‌ కుమార్ - ఊర్వశి వంటి ఎవర్ గ్రీన్ నటీమణులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

'ఆడవాళ్ళు మీకు జోహార్లు' చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రాక్‌ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. సుజిత్‌ సారంగ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడింటింగ్‌ బాధ్యతలు నిర్వ‌హిస్తున్నారు. వెన్నెల కిషోర్ - రవిశంకర్ - సత్య - ప్రదీప్ రావత్ - గోపా రాజు - బెనార్జీ - కళ్యాణి నటరాజన్ - రాజశ్రీ నాయర్ - ఝాన్సీ - రజిత - సత్య కృష్ణ - ఆర్‌సిఎం రాజు వంటి భారీ తారాగణం ఈ సినిమాలో భాగం అవుతున్నారు.