విశ్వనటుడినే మించిపోతోందీవిడ!

Tue Jul 16 2019 12:49:51 GMT+0530 (IST)

ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టగలరా?  గెస్ హూ ఈజ్? ఇంతకీ ఇంత పెద్ద ఫజిల్ వేసిన ఆ అందగత్తె ఎవరై ఉంటారు?  అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.ఈ కుర్ర బ్యూటీ తెలుగు సినిమాలకు దూరమై చాలాకాలమే అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉందీ భామ. సినిమాల కంటే ఈమధ్య `సోషల్ సేవ`ల్లోనే తరించిపోతోంది. రకరకాల కొంటె వేషాలతో ఫ్యాన్స్ ని అలరిస్తోంది. ఒక్కో సారి ఒక్కో వేషం. ప్రతి వేషంలోనూ ఏదో ఒక కొత్తదనం కనిపించేలా జాగ్రత్త పడుతోంది. ఇదివరకూ ఓ ముసలావిడతో డ్యాన్సులు చేస్తున్న కొంటె వీడియోని పోస్ట్ చేసింది. అటుపైనా కికీ ఛాలెంజ్.. బకెట్ ఛాలెంజ్ .. బాటిల్ ఛాలెంజ్ అంటూ చాలానే రచ్చ చేసింది. ఓ తమిళ తంబీ డైరెక్టర్ ఇంగ్లీష్ స్పీచ్ ని వెటకారం ఆడుతూ వ్యంగ్య వీడియోని పోస్ట్ చేసింది.

అవన్నీ గతం. వర్తమానంలో మరింత వేడి పెంచుతూ రకరకాల గెటప్పుల్లోనూ షాకిస్తోంది. ఇదివరకూ తలకిందులుగా యోగా ఎలా చేయాలో చూపిస్తూ ఓ వీడియోని పోస్ట్ చేసి అందరికీ షాకిచ్చింది. మధ్యలో కుక్క పిల్లలతో స్నేహం ఎలా చేయాలో కూడా నేర్పించింది. ఇదిగో ఇప్పుడు ఏకంగా కమల్ హాసన్ లా మారిపోయి గెటప్పునే మార్చేసింది. చూస్తుంటే `ఇంద్రుడు చంద్రుడు`లో మేయర్ కమల్ హాసన్ ని గుర్తు చేస్తోంది. ఇంతకీ ఆయననే ఇమ్మిటేట్ చేస్తోందా?  ఏమో కానీ.. ఆ ఎత్తు పల్లు.. ఆ చికిలింత.. దానికితోడు ఆ బానలాంటి పొట్ట.. వీటికి కళ్లజోడు కాంబినేషన్.. ఆ వేషం అచ్చం కమల్ కి ఇమ్మిటేషనే అని అర్థమవుతోంది. ఏదైతేనేం ఏదో ఒక కొంటె పనితో అల్లరితనంతో ఇలా నెటిజనుల్ని తన చుట్టూనే తిప్పుకుంటోంది. అయితే ఇవే తెలివితేటలు నటనలో చూపించి కెరీర్ ని చక్కదిద్దుకుంటే బావుండేది! అనవసరంగా టైమ్ వేస్ట్ చేసుకుంటోంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నట్టుండి ఈవిడకు ఏమైంది? అని కంగారు పడుతున్నారు కొందరైతే! ఇంతకీ ఈవిడెవరు? అంటే నిస్సంకోచంగా అదా శర్మ అని గుర్తు చేయాలా?  అదా కి అదా! అంటూ ట్విట్టర్ లో అలానే ఇన్ స్టాగ్రమ్ లో అదాశర్మ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. తాజా ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసింది.