పరుపు పై పరవాల ఆరబోతలో ఆదా కాదట.. ఈ భామ!!

Wed Aug 05 2020 22:00:27 GMT+0530 (IST)

Adah Sharma recent pic impress netizens

తెలుగు ఇండస్ట్రీకి హార్ట్ ఎటాక్ సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసిన బ్యూటీ ఆదా శర్మ. డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ ఆదాను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడనే సంగతి తెలిసిందే. అయితే ఫస్ట్ మూవీ హార్ట్ఎటాక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా ఆడకపోయినా.. ఈ భామకి మాత్రం అవకాశాలు తీసుకొచ్చింది. అయితే వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకోలేదేమో.. తెలుగులో ఆదా దాదాపు కనుమరుగైపోయింది. క్షణం సన్నాఫ్ సత్యమూర్తి వంటి హిట్ చిత్రాలు ఆదా ఖాతాలో ఉన్నాయి. అయితే అవి రెండూ మంచి విజయాన్ని సాధించాయి. కానీ ఆదాకు మాత్రం క్రెడిట్ దక్కలేదు. ఇక ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగా ఉంటున్న ఆదా.. ఫోటోషూట్లతో మాత్రం అభిమానులకు కిక్కెక్కిస్తోంది. అయితే అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.వెండితెర పై అంతగా అందాలు ఆరబోయదు కానీ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉంటుంది భామ. ఆదాశర్మ అందాల ఆరబోతలో మాత్రం ఆదా కాదని నిరూపిస్తుంది. నిత్యం కొత్త కొత్త స్టైల్‌లో రెడీ అయి ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఆదా ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ బ్యూటీకి సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. వెరైటీ క్యాస్టూమ్ స్టైలింగ్‌తో నెటిజన్స్‌ను ఆకట్టుకుంటూ ఉంటుంది. నిజానికి ఆదాకి డేర్ కూడా ఎక్కువే. ఎంత చూడముచ్చటగా ఉంటుందో అంతే ఖరాఖండీగా తన అభిప్రాయాలను బయట పెడుతుంది. ఇక తాజాగా అమ్మడు గౌను ధరించి పరుపు పై పరిచిన పరవాల పోజు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అంతేగాక "నేనెప్పుడూ బెడ్ పై యాక్టీవ్ గానే ఉంటా.. ఇంతవరకు కింద పడలేదు" అనేవిధంగా కాప్షన్ జోడించింది. టాప్ టు బాటమ్ ఆదా అందాల పొంగులకు మతిపోతుంది అంటున్నారు ఫ్యాన్స్.