మత్తమందు కలిపి నటిపై అత్యాచారం!!

Sun Jul 05 2020 19:40:27 GMT+0530 (IST)

Actress complains of rape by CEO of a company

కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఆమె సృహ తప్పాక కన్నడ హీరోయిన్ పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ప్రైవేట్ కంపెనీ సీఈవో. ఆ దృశ్యాలను వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసి నగదు లాక్కున్నాడు. ఈ మేరకు హీరోయిన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఈవో బండారం బయటపడింది.బెంగళూరులోని జేజే నగర్ లో హీరోయిన్ నివాసం ఉంటుంది. ఆమె  2018లో బెంగళూరులోని గాంధీబజార్ కాఫీడేకు వెళ్లిన సమయంలో మోహిత్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను ప్రైవేట్ కంపెనీ సీఈవో అని చెప్పి నటిని తమ కంపెనీకి ప్రచార రాయబారిగా నియమించుకున్నాడు. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. గోవాకు తీసుకెళ్లి ఫొటో షూట్ చేయించాడు.

గత ఏడాది జూన్ 22న తన పుట్టినరోజు అని ఇంటికి ఆహ్వానించాడు. అనంతరం నటికి కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. ఆమె మత్తులోకి జారుకోగానే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను వీడియో తీశాడు.

అనంతరం ఆ వీడియో చూపించి డబ్బులు ఇవ్వాలని.. లేకపోతే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరిస్తున్నాడు. ఇప్పటికే ఆ హీరోయిన్ 11 లక్షలు ఇచ్చింది. మళ్లీ బ్లాక్ మెయిల్ చేసి 9 లక్షలు లాగాడు. మరోసారి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

తాజాగా అతడి ఆగడాలు భరించలేని హీరోయిన్ తన తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు మేరకు మోహిత్ తోపాటు అతడి తల్లితండ్రి రాహుల్ అనే వ్యక్తిపై కేసులు నమోదు చేశారు.