వైట్ స్కర్ట్ లో మెరిసిపోతున్న ఊర్వశి రౌతేలా

Tue Jan 24 2023 15:32:39 GMT+0530 (India Standard Time)

Actress Urvashi Rautela latest pic

బాలీవుడ్లో ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న అందాల భామ ఊర్వశి రౌతేలా. ఈ బ్యూటీ చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా సోషల్ మీడియా ద్వారా ఎక్కువ గుర్తింపు సొంతం చేసుకుంది. 2015లో మిస్ యూనివర్స్  విన్నర్ గా నిలిచిన బ్యూటీ అంతకంటే ముందుగానే బాలీవుడ్ లో నటిగా కెరియర్ స్టార్ట్ చేసింది. ఈ  అమ్మడుకి మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా మాత్రం గ్రేట్ గ్రాండ్ మస్తీ.ఈ సినిమాలో ఆమె పోషించిన హాట్ రోల్ కి విపరీతంగా జనాలు కనెక్ట్ అయిపోయారు. హేట్ స్టొరీ 4లో కూడా ఊర్వశీ రౌతేలా మెయిన్ లీడ్ చేసింది. గ్లామర్ బ్యూటీగా బాలీవుడ్ లో విశేషమైన గుర్తింపుని సొంతం చేసుకుంది. ఈ బ్యూటీ హాట్ హాట్ అందాలకి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఓ వైపు హీరోయిన్ గా చేస్తూనే మరో వైపు ఐటెం సాంగ్స్ తో కూడా ఊర్వశీ రౌతేలా సందడి చేస్తుంది. తాజాగా వాల్తేర్ వీరయ్య సినిమాలో ఐటెం సాంగ్ లో ఈ అమ్మడు మెరిసింది. ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

 అలాగే రామ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో కూడా ఊర్వశీ రౌతేలా ఐటెం సాంగ్ చేయబోతుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడుకి సినిమాల ద్వారా వచ్చిన ఫేం కంటే సోషల్ మీడియా ద్వారా విశేషమైన గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ఇన్స్టాగ్రామ్ లో ఊర్వశీకి 61.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె లక్షల రూపాయిలు అర్జిస్తుంది.

కేవలం హాట్ హాట్ ఫోటో షూట్ లని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడం ద్వారానే ఆమె భారీగా ఆదాయాన్ని సంపాదిస్తుంది. ఇప్పటికప్పుడు ఈ అమ్మడు ఇన్స్టాలో హాట్ హాట్ ఫోటోలతో రెచ్చిపోతూ ఉంటుంది. తాజాగా వైట్ స్కర్ట్ లో కళ్ళజోడు పెట్టుకొని స్టైలిష్ గా దిగిన ఫోటోని ఇన్స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటో పెట్టిన రెండు గంటల్లోకే ఏకంగా 2.55 లక్షల లైక్స్ రావడం విశేషం. ఇక ఈ కాస్ట్యూమ్స్ లో చాలా హాట్ గా ఉన్నావ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.