ఫేస్ - బ్రెస్ట్ మాత్రమే కవర్ చేసుకుంటూ.. ఇన్స్టాలో హాట్ బ్యూటీ అరాచకం..!

Sun Sep 25 2022 09:37:22 GMT+0530 (India Standard Time)

Actress Urfi Javed On Instagram

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేవారికి బాలీవుడ్ టీవీ నటి ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. హిందీ 'బిగ్ బాస్' తో పాపులారిటీ తెచ్చుకున్న ఈ భామ.. బోల్డ్ స్టైలింగ్ మరియు విచిత్రమైన ఫ్యాషన్ కు ప్రసిద్ధి చెందింది.డిఫరెంట్ అవుట్ ఫిట్స్ తో అందరి చూపు తనవైపు తిప్పుకునే ఈ బ్యూటీ.. అదే విధంగా ఎక్కువగా ట్రోలింగ్ కి గురవుతూ ఉంటుంది. అయినా సరే అవేమీ పట్టించుకోకుండా ఉర్ఫీ జావేద్ తన బోల్డ్ ఫ్యాషన్ తో నెట్టింట రచ్చ చేస్తుంది.

చిత్ర విచిత్రమైన వేషధారణలతో హాట్ హాట్ ఫొటో షూట్స్ - వీడియోలు పోస్ట్ చేసి యువ హృదయాలని ఆకర్షించడానికి ట్రై చేస్తుంది. ఎక్కువగా అర్థనగ్నంగా పోజులిచ్చి ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది ఉర్ఫీ.

ఆ మధ్య బట్టలన్నీ విప్పేసి తన శరీరాన్ని కేవలం గులాబీ పూల రేకులతో కప్పుకొని సంచలనం సృష్టించింది. ఇటీవల కాటన్ క్యాండీ - సేఫ్టీ పిన్ లతో తయారు చేసిన అవుట్ ఫిట్స్ ధరించి అందరూ అవాక్కయ్యేలా చేసింది.

బిగ్ బాస్ భామ ఈసారి ఎలాంటి డ్రెస్ లో వస్తుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. ఇప్పుడు మరో బోల్డ్ డ్రెస్ తో వచ్చి షాక్ ఇచ్చింది. కేవలం డిస్కో బాల్ మిర్రర్స్ తో చేసిన దుస్తులు ధరించి ఇంటర్నెట్ లో హీట్ పుట్టించింది.

నయా కాస్ట్యూమ్స్ లో 'దిల్ మే మేరే హై దర్ద్-ఈ-డిస్క' పాటతో చేసిన ఓ రీల్ ను ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంది. దీనికి "దర్ద్ ఇ డిస్కో.. ఇస్మే క్యా మేక్ అప్ క్రెడిట్ డు" అని క్యాప్షన్ పెట్టింది ఉర్ఫీ జావేద్.

ఇందులో బాలీవుడ్ బ్యూటీ తన బాడీని ప్రదర్శిస్తూ.. కేవలం ముఖం మరియు బ్రెస్ట్ ని డిస్కో బాల్ దుస్తులతో కవర్ చేసుకుంది. ఉర్ఫీ కొత్త బోల్డ్ లుక్ ఫ్యాన్స్ ని అలరించింది. లైక్స్ షేర్ లతో నెట్టింట వైరల్ అయ్యేలా చేశారు.

ఉర్ఫీ తన కొత్త కాన్సెప్ట్ మరియు ఆలోచనను కొందరు మెచ్చుకుంటుంటే.. మరికొందరు మాత్రం ఎప్పటిలాగే ఆమె ఫ్యాషన్ ఎంపికలను ట్రోల్ చేస్తున్నారు. 'రాజ్ కుంద్రా 2.0' అని కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి ఉర్ఫీ సీరియల్స్ తో కంటే తన బోల్డ్ స్టేట్‌మెంట్స్ మరియు వెరైటీ ఫ్యాషన్ ఎంపికలతో లైమ్ లైట్ లో ఉంటోంది. ఆమె ఇటీవల తోటి సెలబ్రిటీ చాహత్ ఖన్నాతో సోషల్ మీడియాలో గొడవ పడి రచ్చ రచ్చ చేసింది.

అలానే నెట్ ఫ్లిక్స్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా సిమ్ కార్డ్ లతో చేసిన అవుట్ ఫిట్స్ ధరించి హాట్ టాపిక్ గా మారింది ఉర్ఫీ. ఈ క్రమంలోనే ఇప్పుడు ఫేస్ - బ్రెస్ట్ ని మాత్రమే కవర్ చేస్తూ డిస్కో బాల్ కాస్ట్యూమ్స్ ని పరిచయం చేసింది. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి బోల్డ్ ఫ్యాషన్ గోల్స్ తో వస్తుందో చూడాలి.