టబు ని బుట్టలో వేసుకున్న ఆ స్టార్ హీరోలు ఎవరు..?

Mon May 25 2020 08:00:02 GMT+0530 (IST)

Actress Tabu On About Her Marriage

'కూలీ నెం. 1' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది అందాల టబు. కింగ్ నాగార్జున నటించిన 'నిన్నే పెళ్లాడతా' సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్ల పాటు మిగతా హీరోయిన్స్ కి పోటీ ఇచ్చింది. దాదాపు అన్ని ఇండస్ట్రీలలో స్టార్ హీరోలందరితో యాక్ట్ చేసింది టబు. టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ లతో రొమాన్స్ చేసింది. ఇదిలా ఉండగా టబు ప్రస్తుత వయసు 48 ఏళ్ళు. ఈ హీరోయిన్ తో పాటు వచ్చిన చాలా మంది హీరోయిన్స్ ఈపాటికే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. కానీ టబు మాత్రం ఇంకా సింగిల్ గానే తన జీవితాన్ని గడుపుతోంది. ఇంటర్వ్యూలలో పెళ్లెందుకు చేసుకోలేదనే ప్రశ్నకు ఎదో ఒక ఆన్సర్ చెప్పి తప్పించుకుంటూ వస్తోంది. హీరో హీరోయిన్స్ విషయంలో అఫైర్స్ - లవ్ బ్రేక్ అప్స్ వార్తలు మనం తరచూ వింటూనే ఉంటాం. ప్రేమలో పడటం.. కొన్నాళ్ళు డేటింగ్ చేయడం.. అన్నీ కుదిరితే పెళ్లి చేసుకోవడం.. కుదరకపోతే విడిపోయి వేరే వారితో జత కట్టడం.. పెళ్లి చేసుకున్నా ఇద్దరికీ కుదరకపోతే విడిపోవడం.. మళ్ళీ వేరే వారిని పెళ్లి చేసుకోవడం.. ఇలాంటివన్నీ సినీ ఇండస్ట్రీలో కామన్ గా జరిగే విషయాలు. అయితే అలాంటి సంఘటనలే టబు లైఫ్ లో కూడా జరిగాయట.వివరాల్లోకి వెళ్తే టబు అప్పట్లో ఒక టాలీవుడ్ స్టార్ హీరోను ప్రేమించి.. పెళ్లికి కూడా సిద్దమైనట్లు కథనాలు కూడా వచ్చాయి. ఆ స్టార్ హీరోను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన రోజున ఊహించని విధంగా స్టార్ హీరో కుటుంబ సభ్యులు వారి వివాహాన్ని చెడగొట్టినట్లు అప్పట్లో అనేక రూమర్స్ వచ్చాయి. అయితే ఆ తరువాత ఆ హీరో మరో పెళ్లి చేసుకోవడంతో దాదాపు టబు టాలీవుడ్ కి దూరమయ్యింది. బాలీవుడ్ లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వెళ్లిన టబుకి అక్కడ మంచి క్రేజ్ దక్కింది. కానీ అక్కడ కూడా మరొక స్టార్ హీరోను ప్రేమించిన టబు పెళ్లి చేసుకోవాలని అనుకుందట. కానీ అక్కడ కూడా మళ్ళీ టబుకి చేదు అనుభవమే ఎదురైందట. ఆ బాధ నుంచి కొలుకోవడానికి కూడా ఈ బ్యూటీకి చాలా సమయం పట్టిందట. టబు ని ప్రేమించి వదిలేసి ఆమెను విరహ వేదనకు గురి చేసిన ఆ స్టార్ హీరోస్ ఎవరో మరి.

ఇదిలా ఉండగా టబు పెళ్లిపై చాలా ఏళ్లుగా వార్తలు వస్తున్నా పెళ్లి పై ఒక్కసారి కూడా క్లారిటీ ఇవ్వలేదు. రూమర్స్ గురించి పట్టించుకోకుండా కేవలం తన కెరీర్ పైనే దృష్టి పెట్టి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. రెండుసార్లు లవ్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆమెకు పెళ్లిపై నమ్మకం పోయిందట. అందుకే పెళ్లి తనకు అవసరం లేదని ఒక నిర్ణయానికి వచ్చిందట. కాకపోతే చాలా మంది హీరోయిన్స్ లేటు వయసులో కూడా పెళ్లి పీటలెక్కడం మనం చాలానే చూసాం. మరి టబు కూడా తనకు నచ్చిన వాడు దొరికితే తన నిర్ణయాన్ని మార్చుకుంటుందేమో చూడాలి.