బన్నీ అమ్మగా నిన్నే పెళ్లాడతా పండు ?

Thu Mar 21 2019 17:58:22 GMT+0530 (IST)

Actress Tabu Mother Role In Trivikram Movie

ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఖచ్చితమైన డేట్ తెలియదు కానీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మూవీ ఎదురు చూసే కొద్దీ ఆలస్యం అవుతూనే ఉంది. నా పేరు సూర్య తర్వాత ఇప్పటికే ఏడాది పైగా గ్యాప్ తీసుకున్న బన్నీ సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం స్క్రిప్ట్ ఫైనల్ స్టేజిలో ఉంది. ఇంకొద్ది రోజుల్లో లాక్ చేయబోతున్నారట. మరోపక్క ఆర్టిస్టుల సెలక్షన్ కూడా జరుగుతోందని వినికిడి.చాలా కీలకమైన తల్లి పాత్ర కోసం టాలీవుడ్ మాజీ హీరోయిన్ టబుని సంప్రదించబోతున్నట్టు తెలిసింది. ఆవిడ ఒప్పుకుందో లేదో కానీ చర్చలు జరిగిన మాట వాస్తవమని చెబుతున్నారు. నదియా-ఖుష్బూ లాంటి యాక్టర్స్ ని ఏరికోరి తీసుకొచ్చే త్రివిక్రమ్ టబుని ఈజీగానే ఒప్పిస్తాడని టాక్. టబు హిందీలో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ ఫుల్ ఫామ్ లో ఉంది. కానీ సౌత్ నుంచి ఆఫర్స్ వెళ్తున్నా పెద్దగా రెస్పాండ్ కావడం లేదు. ఒకప్పుడు నాగార్జున చిరంజీవి వెంకటేష్ లాంటి అగ్ర హీరోల సరసన ఆడిపాడిన టబు తర్వాత చంద్రసిద్ధార్థ దర్శకత్వంలో ఓ సినిమా చేసింది కానీ అది పెద్దగా ఆడకపోవడంతో కొంత బ్రేక్ తీసుకుంది.

వెబ్ సిరీస్ తో పాటు గత ఏడాది నెగటివ్ షేడ్స్ లో టబు నటించిన అందాధూన్ తనను మరింత బిజీ ఆర్టిస్టుని చేసింది. ఇప్పుడు త్రివిక్రం మూవీ కూడా ఓకే అయితే ఇక్కడా మంచి ఆఫర్స్ దక్కించుకోవచ్చు. అసలు ఈ ప్రతిపాదన తన దాకా ఇంకా వెళ్లిందో లేదో చూడాలి. నిన్నే పెళ్లాడతా-సిసింద్రీ-కూలి నెంబర్ వన్ లాంటి సినిమాల ద్వారా అప్పట్లో యూత్ కి హాట్ ఫెవరెట్ గా ఉన్న టబు బన్నీతో మమ్మీ అనిపించుకుంటుందా వేచి చూడాలి