అవకాశాలు లేని బొద్దుగుమ్మ.. పెళ్లి పీటలు ఎక్కనుందా??

Fri Jun 18 2021 19:00:01 GMT+0530 (IST)

Actress Surabhi Career In Dilemma

సినిమా రంగంలో లైఫ్ అంటేనే నీటి మీద కాగితం పడవ ప్రయాణం లాంటిది. ఎందుకంటే ప్రవాహం సరిగా ఉన్నంతవరకే ప్రయాణం సాఫిగా సాగుతుంది. అదే ప్రయాణంలో ఎలాంటి అడ్డంకులు ఎదురైనా పడవ బోల్తా పడే అవకాశం ఉంటుంది. అలాగే సినిమా ఇండస్ట్రీలో హిట్స్ మాత్రమే యాక్టర్ ప్రయాణాన్ని డిసైడ్ చేస్తాయి. హిట్స్ ఉన్నంతవరకు కెరీర్ బాగానే ఉంటుంది. ఎప్పుడైతే వరుసగా ప్లాప్స్ సినిమాలు వస్తాయో అంతే కెరీర్ ఒక్కసారిగా రివర్స్ అయిపోతుంది. లైఫ్ ఆలోచనల్లో పడిపోతుంది. అయితే హీరోల సంగతి పక్కనపెడితే.. హీరోయిన్స్ మాత్రం ఫామ్ లో లేకపోతే చాలా కష్టం.ఈ మధ్యకాలంలో హిట్స్ లేక ప్లాప్స్ లో కూరుకుపోయి అవకాశాలు కూడా కరువై హీరోయిన్స్ టైమ్ వేస్ట్ అవుతుందని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఎలాగో ఫామ్ లో ఉన్నా లేకపోయినా పెళ్లి అనేది ఎప్పుడో ఒకప్పుడు చేసుకోవాల్సిందే కదా అని అలా కానిచేస్తున్నారు. ఇటీవలి కాలంలో హీరోయిన్ ప్రణీతను చూసాం. అవకాశాలు లేకపోయే సరికి పెళ్లి చేసేసుకుంది. తాజాగా మరో టాలీవుడ్ హీరోయిన్ గురించి కూడా అలాంటి వార్తలే వినిపిస్తున్నాయి. అందమైన చెక్కిళ్లు కలిగిన చెన్నై సుందరి సురభి. తెలుగు ప్రేక్షకులు పెద్దగా పరిచయం అక్కర్లేదు. అందంతో అభినయంతో ఎప్పటికప్పుడు తన అభిమానులను ఎంటర్టైన్ చేస్తూనే ఉంది.

అయితే అందరు హీరోయిన్స్ మాదిరే సురభి కూడా ప్రారంభంలో తెలుగుతనం నిండిన పక్కింటి అమ్మాయిలా కనిపించింది. వరుస సినిమాలతో జోరుమీద ఉన్నప్పుడు గ్లామర్ కిటికీలు తెరిచి అందాల విందును ప్రారంభించింది. కానీ ఎంత అందం గుప్పించినా సురభికి అవకాశాలు ఎందుకు కరువయ్యాయో జవాబు తెలియని ప్రశ్న. అంటే దానికి కారణం ప్లాప్ సినిమాలే కావచ్చు. బేసిగ్గా ఫస్ట్ తమిళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ. బీరువా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది.

ఆ తర్వాత ఎక్ష్ప్రెస్స్ రాజా జెంటిల్ మెన్ చిత్రాలతో పాటు కొన్ని సినిమాలలో నటించినా పెద్దగా పేరు రాలేదు. లాభం లేదని ఒక్కక్షణం సినిమాలో గ్లామర్ డోస్ పెంచి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది కానీ అవకాశాల పరంగా అయినా ఫేట్ మారలేదు. చివరిగా ఆది సరసన శశి సినిమాలో మెరిసింది. భారీ ఆశలు పెట్టుకున్న ఆ సినిమా ఊహించని రేంజిలో ప్లాప్ అయింది. ప్రస్తుతం వయ్యారి చేతిలో సినిమాలు లేవు. మరి ఈమె కూడా పెళ్లి పీటలు ఎక్కే ఆలోచనలో ఉందేమో చూడాలి అంటున్నాయి సినీవర్గాలు.