Begin typing your search above and press return to search.

సాగ‌ర‌క‌న్య సూప‌ర్ ఉమెన్ విన్యాసాలు!

By:  Tupaki Desk   |   17 May 2022 3:03 AM GMT
సాగ‌ర‌క‌న్య సూప‌ర్ ఉమెన్ విన్యాసాలు!
X
సాగ‌ర‌క‌న్య‌గా తెలుగు వారి గుండెల్లో నిలిచింది శిల్పాశెట్టి. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు తెర‌కెక్కించిన సాహ‌స‌వీరుడు- సాగ‌ర‌కన్య చిత్రంలో శిల్పా శెట్టి మ‌త్స్య‌క‌న్య‌గా అద్భుతంగా న‌టించి తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయింది. ఆ త‌ర్వాత టాలీవుడ్ లో ద‌శాబ్ధం పాటు ప‌లువురు టాప్ హీరోల స‌ర‌స‌న న‌టించింది. ఆ త‌ర్వాత బాలీవుడ్ లో స్థిర‌ప‌డింది. అక్క‌డ బిజినెస్ మేన్ రాజ్ కుంద్రాను శిల్పాశెట్టి పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే.

ఇక రాజ్ కుంద్రా నీలి చిత్రాల యాప్ ల దుమారం గురించి తెలిసిన‌దే. ఇలాంటి వివాదాల‌తో శిల్పా శెట్టి కెరీర్ ముగిసిన‌ట్టేన‌ని టాక్ కూడా వినిపించింది. బుల్లితెర వెండితెర పై త‌న‌కు అవ‌కాశాలు త‌గ్గిపోయాయ‌ని కూడా గుసగుస‌లు వినిపించాయి. కానీ అనూహ్యంగా శిల్పాజీ ఇప్పుడు త‌న కంబ్యాక్ ని చాటుకుంటున్నారు.

శిల్పాశెట్టి సూపర్ ఉమెన్ గా సోషల్ మీడియాలో ప్ర‌త్య‌క్షం కావ‌డం షాక్ కి గురి చేసింది. కొన్నాళ్ల క్రితం శిల్పాశెట్టి తన అభిమానులకు షాక్ లిస్తూ సోషల్ మీడియా నుండి వైదొలుగుతున్నాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తిరిగి వ‌స్తే ఒక‌ కొత్త అవతార్ తో మాత్రమే తిరిగి వస్తానని హామీ ఇచ్చింది. ఇప్పుడు త‌న మాట‌ను నిల‌బెట్టుకుంటూ ఇలా ప్ర‌త్య‌క్ష‌మైంది. ఒక సరికొత్త సూపర్ ఉమెన్ అవతార్ తో సోషల్ మీడియాలోకి తిరిగి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

సబ్బీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నీకమ్మ సినిమాలో శిల్పా ఇంతకు ముందు తాను పోషించిన పాత్రలకు భిన్నంగా అవనీ పాత్రను పోషిస్తోంది. ఈ వెరీ స్పెష‌ల్ సూపర్ ఉమెన్ లుక్ తో హాట్ టాపిక్ గా మారింది. ట్రైలర్ లో రివీల్ అయ్యే మరో స్పెషల్ లుక్ ఇది అని అంద‌రికీ అర్థ‌మ‌వుతోంది. త్వ‌ర‌లో ట్రైల‌ర్ విడుద‌ల కానుంది. త‌న మూవీ రిలీజ్ ముందు ప్ర‌మోష‌న్స్ లో శిల్పాజీ బిజీ అయిపోయారు.

వివాదాలు ఒక వైపు.. కెరీర్ ఇంకో వైపు..

ఓవైపు వివాదాల‌తో అంట‌కాగుతున్నా మ‌రోవైపు సినిమాల్లో వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తూ ఆర్జిస్తోంది శిల్పాశెట్టి. త‌న‌కు ఇంకా బ్రాండ్ వ్యాల్యూ ఎంత‌మాత్రం త‌గ్గ‌లేద‌ని ప్రూవ్ చేస్తోంది. వ‌రుస ఫోటోషూట్లతో ఓవైపు ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. శిల్పాజీ ఫోటోషూట్లు ఇటీవ‌ల‌ అంత‌ర్జాలంలో హాట్ టాపిక్ గా మారాయి.

ఇక వివాదాల మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఇటీవ‌లే శిల్పాజీ భ‌ర్త రాజ్ కుంద్రా నీలి చిత్రాల కేసులో అరెస్ట‌యి బెయిల్ పై విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత చాలా కాలానికి ఈ జంట ప‌బ్లిక్ అప్పియ‌రెన్స్ పైనా చ‌ర్చ సాగింది. ఈ లైఫ్ ఇలా సాగుతుండ‌గానే ర‌క‌ర‌కాల‌ వివాదాలు కూడా ఉక్కిరిబిక్కిరి చేసాయి. నితిన్ బరాయ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు నటి శిల్పాశెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రాపై గ‌త కొద్ది రోజుల క్రితం ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది. ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీనిపై ప్ర‌స్తుతం కోర్టుల ప‌రిధిలో విచార‌ణ సాగుతోంది.

క‌ష్టంలో భ‌ర్త‌కు అండ‌గా..

రాజ్ కుంద్రా నీలి చిత్రాల యాప్ ల వివాదం అరెస్ట్ అనంత‌రం తన సోషల్ మీడియా ఖాతాలను శాశ్వ‌తంగా తొలగించిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం అత‌డిని డిపెండ్ చేసేందుకు శిల్పాజీ చాలా ప్ర‌య‌త్నాలు చేసారు. మీరు మీ సౌకర్యవంతమైన నగరాన్ని విడిచిపెట్టి.. మీ అంతర్ దృష్టి అనే అరణ్యంలోకి వెళ్లాలి. అక్క‌డ‌ మీరు కనుగొనేది అద్భుతంగా ఉంటుంది. మీరు కనుగొనేది మిమ్మ‌ల్నే అంటూ శిల్పాశెట్టి త‌న భ‌ర్త‌ను డిపెండ్ చేసింది. క‌ష్ట కాలంలో ఎలా ఎదురెళ్లి నిల‌బ‌డాలో కూడా శిల్పాజీ త‌న సోష‌ల్ మీడియాల ద్వారా అనుచ‌రుల‌కు రివీల్ చేయ‌డం ఆస‌క్తిక‌రం.