నటసింహా మూవీలో శ్రీలీల సర్ ప్రైజ్ రోల్?

Sun May 22 2022 17:00:01 GMT+0530 (India Standard Time)

Actress Srileela In Balayya Movie

యంగ్ హీరోయిన్ శ్రీలీల ఇటీవల `పెళ్లిసంద-డి` సినిమాతో టాలీవుడ్ కి సుపరిచితం అయ్యింది. ఆరంగేట్రమే తనదైన నటన డ్యాన్సులతో మైమరిపించింది. నేటితరంలో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీగా ఇండస్ట్రీ తనను చూస్తోంది. తొలి సినిమా విడుదలైన తర్వాత శ్రీలీల పూర్తిగా లుక్ మార్చేసింది. ఇప్పుడు బరువు తగ్గి స్లిమ్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం మాస్ రాజా రవితేజతో కలిసి ధమాకా చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. తదుపరి నటసింహా నందమూరి బాలకృష్ణ సినిమాని కూడా కైవసం చేసుకుంది.ఎఫ్ 3 తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న బాలయ్య చిత్రానికి శ్రీలీల సంతకం చేసినట్లు ఇంతకుముందు టాక్ వినిపించినా కానీ ఇప్పటికీ దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఆ సినిమాలో ఆమె హీరోయిన్ గా కనిపించదు కానీ సినిమాలో బాలయ్య కూతురిగా కనిపించనుందని తెలుస్తోంది. బాలయ్య 50 ఏజ్ పెద్దమనిషిగా ఇందులో కనిపిస్తారు. అతడి జీవితానికి సంబంధించిన కథాంశంలో కూతురు పాత్ర రక్తి కట్టిస్తుందట. నటసింహాకు కూతురిగా నటించేందుకు శ్రీలీలాను తగిన నటిగా గుర్తించి అనీల్ రావిపూడి ఆఫర్ ఇచ్చారట.

అంతేకాదు.. బాలకృష్ణతో అనీల్ ఓ భారీ ప్రయోగం చేస్తున్నాడని ఈ సినిమా ద్వారా తండ్రీకూతుళ్ల అనుబంధానికి సంబంధించిన కొత్త కోణాన్ని వెండితెరపై ఆవిష్కరించనున్నాడని సమాచారం. మరోవైపు ఈ సినిమాలో బాలయ్య భార్యగా మరో స్టార్ హీరోయిన్ కాస్త ఏజ్డ్ హీరోయిన్  నటిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే బాలయ్య గెటప్ కూడా ఇందులో సంథింగ్ స్పెషల్ గా ఉంటుందట.