కంగనా పేరుతో శ్రీదేవి రిపోర్ట్ మార్చారు!

Sun Jul 05 2020 17:30:32 GMT+0530 (IST)

Actress Sridevi Fake Autopsy Report Viral in social media

బాలీవుడ్ తో పాటు దేశం మొత్తం కూడా గుర్తింపు దక్కించుకుని శ్రీదేవి మరణంను జనాలు ఇంకా కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. ఎంతో స్టార్ డం దక్కించుకున్న శ్రీదేవి అనూహ్యంగా ఎక్కడో దుబాయిలో ఒక హోటల్ లో అది కూడా బాత్ టబ్ లో పడి మృతి చెందడంను ఎవరు ఒప్పుకోలేక పోతున్నారు. శ్రీదేవి మరణంపై పలువురు పలు రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇటీవల దుబాయి ప్రభుత్వం ఇచ్చిన డెత్ రిపోర్ట్ అంటూ ఒక రిపోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.ఆ రిపోర్ట్ లో శ్రీదేవి మరణించే సమయంలో డ్రగ్స్ తీసుకోవడంతో పాటు ఆల్కహాల్ తీసుకుని ఉంది. అదే సమయంలో ఆమె చేతిపై కత్తితో పెట్టినట్లుగా కాట్లు ఉన్నాయి. ఇక ఆమె బాత్ టబ్ లో రక్తపు మడుగులో ఉన్నట్లుగా ఆ రిపోర్ట్ లో ఉంది. దాన్ని కంగనా రనౌత్ పేరుతో ఉన్న సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ అయ్యింది. దాంతో కంగనా ఆ రిపోర్ట్ ను షేర్ చేసింది కనుక నిజమేనేమో అనుకున్నారు. కాని అసలు విషయం ఏంటీ అంటే అది ఫేక్ రిపోర్ట్.

దుబాయి ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ లో చాలా క్లియర్ గా శ్రీదేవి బాత్ టబ్ లో ఊపిరి ఆడక పోవడం వల్ల మృతి చెంది ఉంది. అంతకు మించి మరేం లేదు. కనుక ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కావాలని ఇలాంటి పుకార్లను ప్రచారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు గాను కంగనా పేరును వాడుకుంటున్నారు అంటున్నారు. కంగనా పేరుతో వారు చేస్తున్న ప్రచారంతో ఆమెకు బ్యాడ్ నేమ్ వస్తుంది. ట్విట్టర్ లేదా ఫేస్ బుక్ లో కంగనాకు అధికారికంగా ఖాతా లేదు. కనుక ఇది కొందరు కేటుగాళ్ల పని అయ్యి ఉంటుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.