లక్ అంటే ఈ హీరోయిన్ దే..!

Sat Oct 23 2021 07:00:01 GMT+0530 (IST)

Actress Sreeleela Upcoming Movies

ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ అవకాశాల కోసం ఎంతగా ప్రయత్నాలు చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క అవకాశం దక్కితే మళ్లీ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లుగా పరిస్థితి ఉండదు. కొందరు మూడు నాలుగు అయిదు పది సినిమాలు చేసినా కూడా కొత్త ఆఫర్ల కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది. కాని కొందరు అదృష్టం మాత్రం వారికి మొదటి సినిమాతోనే ఆఫర్లు తెప్పిస్తుంది. ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టికి మొదటి సినిమా విడుదలకు ముందే మంచి ఆఫర్లు వచ్చాయి. ఇప్పుడు అదే తరహాలో పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీలకు కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈమెకు మొదటి సినిమా విడుదల కాకుండానే ఆఫర్లు వచ్చాయి. రవితేజ.. త్రినాధ రావు నక్కిన ల కాంబోలో రూపొందుతున్న సినిమాలో శ్రీలీల ఆఫర్ దక్కించుకుంది.పెళ్లి సందడి సినిమా సక్సెస్ అయితే అమ్మడి ముందు క్యూ చాంతాడంత ఉండేది. కాని సినిమా ప్లాప్ అవ్వడంతో కాస్త తక్కువ అయ్యింది. ఇప్పటికి కూడా ఈ అమ్మడి ముందు ఉన్న ఆఫర్లు తక్కువేం కాదు. కొత్త హీరోల నుండి టైర్ 2 హీరోలు పలువురు ఈమెతో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారు. అనధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈమె ముందు ప్రస్తుతం అరడజను సినిమాలు ఉన్నాయట. ఆ సినిమాలన్నింటిని ఈమె ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి. వచ్చే ప్రతి ఆఫర్ ను ఒప్పుకుని కెరీర్ లో తప్పటడుగులు వేయకుండా ఆచి తూచి ఆఫర్లను సెలక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ సమయంలో కాస్త అటు ఇటుగా ఆలోచిస్తే ఆమె కెరీర్ ఇబ్బందిలో పడే అవకాశం ఉంది. అందుకే అంది వచ్చిన అదృష్టంను సద్వినియోగం చేసుకునేందుకు ఈ అమ్మడు ప్రయత్నాలు చేస్తోంది. తెలుగులో ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. మొదటి సినిమా ప్లాప్ అయినా కూడా ఇంతగా ఆఫర్లు రావడం అంటే మామూలు విషయం కాదు. అందుకే ఈమెది మామూలు లక్ కాదంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. శ్రీలీల ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.