సౌందర్య ఇల్లు ఇప్పుడు ఇలా తయారైందా?

Thu Jun 24 2021 05:00:01 GMT+0530 (IST)

Actress Soundarya Home

చిత్ర పరిశ్రమ ఏదైనా.. హీరోయిన్ సక్సెస్ మంత్ర స్కిన్ షో! ఎప్పుడో మొదలైన ఈ ట్రెండ్.. ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఒంపు సొంపులు చూపించాలి.. అందాలు ఆరబోయాలి.. అప్పుడే ఇండస్ట్రీలో నాలుగు కాలాలపాటు మనగలమని నమ్ముతారు నటీమణులు. అందుకే.. మెజారిటీ భామలు ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతుంటారు. కానీ.. ఈ ట్రెండ్ ను బ్రేక్ చేసిపడేసి స్కిన్ షో చేయకుండా కూడా అగ్ర నటిగా ఏళ్ల తరబడి కొనసాగారు సౌందర్య.అభినవ సావిత్రిగా ప్రేక్షకుల నీరాజనం అందుకున్న ఆమె.. కేవలం కళ్లతోనే కావాల్సిన భావాలు పలికించగల అరుదైన నటిగా గుర్తింపు పొందారు. తన కట్టూ బొట్టుతో అభిమానులను సంపాదించుకున్నారు. చిట్టి పొట్టి నెక్కర్లు వేసుకోవాల్సిందే.. ఎద పొంగులు ఎరగా వేయాల్సిందేననే సూత్రాన్ని ఇండస్ట్రీ నమ్ముతున్న సమయంలో.. సంప్రదాయ చీరకట్టుతోనే అగ్రతారగా వెలుగొందారు.

ఇలాంటి నటీమణి.. ఎవ్వరూ ఊహించని విధంగా కేవలం 31 సంవత్సరాల వయసులోనే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. 17 సంవత్సరాల క్రితం జరిగిన విమాన ప్రమాదంలో ఆమె మరణించారు. ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా వెండితెరపై ఆమె వేసిన ముద్ర.. ఇంకా సజీవంగానే ఉంది. ఆమె బయోపిక్ అంశం హాట్ టాపిక్ గా మారడం అందులో నటించేందుకు హీరోయిన్లు పోటీపడుతుండడమే ఇందుకు నిదర్శనం.

కాగా.. అంత చిన్న వయసులోనే వందకు పైగా చిత్రాల్లో నటించిన సౌందర్యకు.. రూ.వంద కోట్ల ఆస్తులు ఉన్నాయని కుటుంబ సభ్యులే గతంలో ప్రకటించారు. అయితే.. సొంత ఇల్లు అనేది ప్రతీ ఒక్కరి కల. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఈ కోరిక ఉంటుంది. ఇదేవిధంగా సౌందర్య కూడా.. ఎంతో ఇష్ట పడి బెంగళూరులో ఓ బంగ్లాను కొనుగోలు చేశారు. ఆమె ఉన్నంత కాలం వెలిగిపోయిన ఆ బంగ్లా.. ఇప్పుడు కళావిహీనంగా మారిపోయిందట. విమాన ప్రమాదంలో సౌందర్య సోదరుడు మరణించిన తర్వాత కొంత కాలం ఆమె తల్లి ఆ ఇంట్లో ఉండేదని ఆ తర్వాత ఆమె కూడా ఖాళీ చేయడంతో.. ప్రస్తుతం నిర్మానుష్యంగా ఉందట. సౌందర్య స్నేహితురాలు సీనియర్ నటి ఆమని ఈ విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.