Begin typing your search above and press return to search.

అశ్లీలం కూడా కళా రూపమే: నటి సోమి అలీ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   30 July 2021 5:01 AM GMT
అశ్లీలం కూడా కళా రూపమే: నటి సోమి అలీ సంచలన వ్యాఖ్యలు
X
అశ్లీల వీడియోలు తీసి అరెస్ట్ అయిన వ్యాపారవేత్త రాజ్ కుంద్రా వ్యవహారంలో పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే నటి సోమి అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కామసూత్ర’ పుట్టిన భారతదేశంలో అశ్లీలంపై నిషేధం విధించడం న్యాయమేనా? అని ప్రముఖ నటి సోమి అలీ హాట్ కామెంట్స్ చేసింది. అది కూడా ఓ కళారూపమే అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. నీలి చిత్రాలకు మద్దతుగా నటి మాట్లాడింది.

పాకిస్తాన్ లో పుట్టి. అమెరికాలో పెరిగి నటిగా మారిన సోమి అలీ 90వ దశకంలో బాలీవుడ్ సినిమాల్లోనూ నటించి అలరించింది. సల్మాన్, సైఫ్ అలీఖాన్, సంజయ్ దత్ తదితర పెద్దస్టార్ల సరసన పలు సినిమాలు చేసింది.అవకాశాలు తగ్గాక తిరిగి అమెరికా వెళ్లిపోయింది. సామాజికసేవ వైపు సోమి అలీ మళ్లింది.

‘నో మోర్ టియర్స్’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన సోమి అలీ.. అత్యాచార బాధితులకు అండగా నిలుస్తున్నారు.

బాలీవుడ్ లో హీరోయిన్ గా వెలుగు వెలిగిన సోమి అలీ.. ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తోన్న ‘రాజ్ కుంద్రా అశ్లీల రాకెట్’పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘శృంగారం లేదా అశ్లీలం గురించి మాట్లాడడాన్ని నిషేధిస్తే దానిపై అంతగా ఉత్సుకత పెరుగుతుంది. లైంగిక జీవులుగా మానవులకు ఇది అత్యంత సహజమైన విషయం. వ్యక్తిగతంగా నటీనటులు బాధపడడం లేదా లైంగిక అక్రమ రవాణా జరగనంత వరకు ఎవరైనా అశ్లీలతను తమ వృత్తిగా ఎంచుకుంటే దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. దీని గురించి తీర్పులు చెప్పే హక్కు ఇతరులకు లేదు. అశ్లీల చిత్రాల్లో నటించేవాళ్లను సంస్కరించాలన్న ఆలోచన కూడా నాకు లేదు. అశ్లీల చిత్రాలలో పాల్గొనేవారికి లేదా వారి వృత్తిగా మార్చేవారికి వ్యతిరేకంగా నాకు ఏమీ లేదని.. నిజం చెప్పాలంటే అశ్లీలం కూడా కళాత్మక పురోగతే అని భావిస్తున్నాను’ అని కీలక వ్యాఖ్యలు చేసింది.

కామసూత్ర పుట్టిన దేశంలో ఇలా నీలిచిత్రాలను నిషేధించడం ఏంటి విచిత్రంగా అని సోమీ అలీ వ్యాఖ్యానించారు. లైంగిక జీవితం లేకపోతే మానవులే లేరని ఆమె అభిప్రాయపడ్డారు.