చీర కట్టులో కృష్ణ ప్రియురాలు వ్రింద సూపర్ క్యూటీ

Sun Sep 25 2022 20:27:57 GMT+0530 (India Standard Time)

Actress Shirley Latest Photo

నాగశౌర్య హీరోగా నటించిన కృష్ణ వ్రింద విహారి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన న్యూజిలాండ్ ముద్దుగుమ్మ షిర్లీ సెటియా మొదటి సినిమాతోనే ఆకట్టుకుంది. న్యూజిలాండ్ అమ్మాయి అయినా కూడా భలే ఉందే అన్నట్లుగా ప్రశంసలు దక్కించుకుంది. చూడ్డానికి విదేశీ అమ్మాయి అన్నట్లుగా లేదంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.ముందు ముందు తెలుగుతో పాటు ఇండియన్ సినిమాపై వెలుగు వెలిగేంత షిర్లీ సెటియా సత్తా ఈ అమ్మాయికి ఉందని.. అందంతో పాటు అభినయం విషయంలో మంచి మార్కులను దక్కించుకుంది. విభిన్నమైన బాడీలాంగ్వేజ్ తో ఈ అమ్మాయి నటించే తీరుకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవ్వాల్సిందే అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఈ అమ్మడు ఇలా చీర కట్టు ఫోటోలను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చీర కట్టు లో ఎంత ముద్దుగా ఉన్నావో అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. చాలా క్యూట్ గా అందంగా ఉన్న షిర్లీ సెటియా ని చూస్తూ ఉంటే అలాగే చూడాలని ఉందంటూ కొందరు అంటున్నారు. ముందు ముందు తెలుగులో ఈమె చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు.

మల్టీ ట్యాలెంటెడ్ గా మంచి పేరు దక్కించుకున్న ఈమె గురించి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరో మరియు దర్శకుడు పదే పదే పలు సార్లు ప్రశంసించారు. నటిగానే కాకుండా ఆమెలో సింగర్ గా ఇంకా ఎన్నో యాంగిల్స్ ఉన్నాయంటూ వారు పేర్కొన్నారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనలేక పోయిన షిర్లీ సెటియా త్వరలోనే మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిద్దాం.