గర్వంగా వుందంటూ సామ్ ట్వీట్ .. ఏం జరిగిందబ్బా?

Sun Jun 26 2022 22:00:01 GMT+0530 (India Standard Time)

Actress Samantha Ruth Prabhu

నాగచైతన్యతో విడాకుల తరువాత సమంత తన దృష్టి మొత్తం కెరీర్ పై పెట్టింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్ లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. అంతే కాకుండా గతంలో కంటే భారీ స్థాయిలో కమర్షియల్ యాడ్ లలో నటిస్తూ హల్ చల్ చేస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ యమ యాక్టీవ్ గా వుంటూ ప్రతీ విషయంలోనూ జెట్ స్పీడుతో స్పందిస్తూ ట్వీట్ లో చేస్తోంది. ఇటీవల చై బాలీవుడ్ హీరోయిన్ శోభిత ధూళిపాలతో డేటింగ్ లో వున్నాడంటూ వచ్చిన వార్తలపై స్పందించింది.ఈ వార్తలని సామ్ పీఆర్ టీమ్ పుట్టించిందంటూ నాగచైతన్య చేసిన కామెంట్ కు సోషల్ మీడియా వేదికగా  స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అమ్మాయిలం ఎదిగాం ఎదుగుతున్నాం. అబ్బాయిలూ మీరు కూడా ఎదగండి అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆదివారం సామ్ చేసిన ట్వీట్ ఆక్తికరంగా మారింది. #HappeningHyderabad అనే హ్యాష్ ట్యాగ్ ని షేర్ చేసిన సమంత గర్వంగా వుంది కేటీఆర్ సర్ అంటూ ప్రశంసల వర్షం కురిపించింది.

సామ్ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పై ప్రశంసలు కురిపించడానికి కారణం ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రం టీ హబ్. దీని రెండవ దశని గచ్చిబౌలి సమీపంలోని రాయదుర్గంలో చేపట్టారు.ఈ నిర్మాణాన్ని జూన్ 28న ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యవంలోనే ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం ట్వీట్ చేశారు. టి హబ్ హైదరాబాద్ ప్రారంభం తో తెలంగాణలో ఇన్నోవేషన్ ఏకో సిస్టమ్ కు పునరుజ్జీవం రానుందన్నారు.

ఈ రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు రానున్నయన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్వీట్ ని రీ ట్వీట్ చేసిన సామ్ #HappeningHyderabad అనే హ్యాష్ ట్యాగ్ ని షేర్ చేసిన సమంత గర్వంగా వుంది అని ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. గతంలో సమంత తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రభుత్వానికి సంబంధించిన పోస్ట్ లపై స్పందిస్తోంది. ఇదిలా వుంటే సమంత ప్రస్తుతం`శాకుంతలం` షూటింగ్ పూర్తయి రిలీజ్ కి రెడీ అవుతుండటంతో `యశోద` మూవీతో పాటు విజయ్ దేవరకొండ తో కలిసి `ఖుషీ` మూవీలో నటిస్తోంది.