ఫొటోటాక్ : స్టార్ అయ్యే ఫీచర్స్ బాగానే ఉన్నాయి

Sun Aug 01 2021 05:00:01 GMT+0530 (IST)

Ruhi Singh photo Goes Viral On Social media

ది వరల్డ్ బి ఫోర్ హర్ అనే ఇంగ్లీష్ సినిమా తో నటిగా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ రుహి సింగ్. ఆ తర్వాత క్యాలెండర్ గర్ల్స్ సినిమాతో హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీలో అడపా దడపా ఆఫర్లు దక్కించుకుంటూ తెలుగులో కూడా ఇటీవలే మోసగాళ్లు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. సినిమాలు.. వెబ్ సిరీస్ లు సమాంతరంగా చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడికి స్టార్ హీరోయిన్ అయ్యే ఫీచర్స్ ఫుల్ గా ఉన్నాయంటూ ఈ ఫొటోను చూస్తే అనిపిస్తుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.సోషల్ మీడియాలో అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గకుండా రెగ్యులర్ గా హాట్ ఫొటో షూట్ ను కవర్ పేజీ స్టిల్స్ ను ఇవ్వడంతో పాటు మోడలింగ్ లో కూడా బిజీగా ఉండే ఈ అమ్మడు తాజాగా షేర్ చేసిన ఈ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎక్కువగా స్కిన్ ఎక్స్ పోజ్ చేకుండా ఎంత వరకు చూపించాలో అంత వరకు చూపిస్తూ ఆకట్టుకునే అందంతో ఈ అమ్మడు చేస్తున్న ఎక్స్ పోజింగ్ అందరిని మైమరపిస్తుంది.

మొదటి సారి చూస్తున్న వారు వావ్ ఎవరు ఈమె ఇన్నాళ్లుగా మేము ఈ అందంను చూడలేక పోయామా అంటూ కామెంట్స్ చేస్తుంటే కొందరు మాత్రం ఈమె ఫొటోలను ఎందుకు బడా ఫిల్మ్ మేకర్స్ చూడటం లేదు.. వారు కనుక ఈ ఫొటోను చూస్తే ఖచ్చితంగా రెండు మూడు సినిమాలు ఆఫర్లు ఇస్తారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు కాకున్నా మరి కొన్నాళ్ల తర్వాత అయినా ఖచ్చితంగా ఈమెకు స్టార్ హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకునేంత అందం ఉందని.. ఈమె ఒక అద్బుతమైన అంద గత్తె అంటూ కామెంట్స్ వస్తున్నాయి.