రుహనీ శర్మ.. మైండ్ బ్లోయింగ్ లుక్

Tue Jan 24 2023 10:02:17 GMT+0530 (India Standard Time)

Actress Ruhani Sharma latest photo

టాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న అందాల భామ రుహనీ శర్మ. ఈ అమ్మడు చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా నటిగా మాత్రం మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. చిలాసౌ అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తరువాత హిట్ డర్టీ హరి మీట్ క్యూట్ సినిమాలతో ఆకట్టుకుంది. ఆమె చేసిన సినిమాలలో అన్ని కూడా మంచి ఫీల్ గుడ్ రోల్స్ లో కనిపించింది. దీంతో నటిగా ఈ అమ్మడుకి మంచి మార్కులు పడ్డాయి. అయితే టాలీవుడ్ దర్శకులు ఆమెలో ఉన్న గ్లామర్ ని మాత్రం ఎవరూ గుర్తించలేదు.ప్రస్తుతం ఈ బ్యూటీ లీడ్ రోల్ లో హెర్ అనే మూవీ తెరకెక్కుతుంది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఈ మూవీ ఉండబోతుంది. ఇదిలా ఉంటే రుహనీ శర్మ ఈ సినిమాతో యాక్షన్ క్వీన్ గా తనని తాను ప్రాజెక్ట్ చేసుకుంటుంది. ఇదిలా ఉంటే సినిమాలో డీసెంట్ పాత్రలు చేసే రుహనీ శర్మ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటోలతో సందడి చేస్తుంది.

తాజాగా ఈ అమ్మడు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. ఆ ఫోటోలు చూసిన ఎవరైనా కూడా రుహనీలో ఇంత అందం ఉందా అని ఆశ్చర్యపోవడం గ్యారెంటీ. తెలుగుదనం ఉట్టిపడే విధంగా ఎన్కిఏ అమ్మడు పరువాలు ఆరబోస్తూ వయ్యారాలు పోతుంది. డార్క్ కలర్ డ్రెస్ లో జాకెట్ ధరించి గోదావరి గట్టుపై ఎంకి రూపంలో ఈమె అలా సిగ్గుతో హొయలు ఒలికిస్తూ ఆకట్టుకుంటుంది.

కరెక్ట్ గా ఉపయోగించుకొని కమర్షియల్ హీరోయిన్ అనిపించుకోవడానికి కావాల్సినన్ని ఫీచర్స్ ఈ అమ్మడు ఒంపుసొంపులో ఉండటం విశేషం. ఇక ఈ ఫోటో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన గంటలోనే ఏకంగా 152 వేలకి పైగా లైక్స్ రావడం విశేషం. అచ్చమైన తెలుగమ్మాయి అందం అంతా రుహనీ శర్మలోనే ఉందని ఈ ఫోటో చూస్తున్న వారు కామెంట్స్ చేస్తున్నారు. మన తెలుగు దర్శకులు ఇప్పటికైనా రుహనీ శర్మకి సరైన ఛాన్స్ లు ఇచ్చి ఆమె బోల్డ్ అందాలని ప్రేక్షకులకి అందించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనే మాట వినిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.