అలాంటి రూల్స్ పెడితే ఎట్టా అమ్మడు..!

Tue Nov 29 2022 06:00:02 GMT+0530 (India Standard Time)

Actress Ruhani Sharma latest photo

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్కరు స్టార్ హీరోయిన్ అవ్వరు. కొందరికి ఒక్క సినిమాతోనే లక్ కలిసి వస్తే మరికొందరికి మాత్రం ఐదారు సినిమాలకు గానీ ఒక గుర్తింపు రాదు. అయితే ఒకసారి ఐడెంటిటీ వచ్చాక తన కోసం వచ్చిన ఆఫర్లను చేసుకుంటూ పోవాల్సిందే. కానీ టాలీవుడ్ లో ఒక హీరోయిన్ మాత్రం అలా కాకుండా ఆఫర్ లు వచ్చినా సరే చేయనని అంటుంది. కారణం ఎందుకంటే.. తనకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తానని చెబుతోంది.ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరు అంటే రుహాని శర్మ అని తెలుస్తుంది. చి.ల.సౌ సినిమాతో మెప్పించిన రుహాని శర్మ ఆ సినిమాలో తన పాత్రలో ఆమె అభినయం అందరిని మెప్పించింది. అయితే చిలసౌ తర్వాత హిట్ మూవీ చేసిన రుహాని ఆ తర్వాత డర్టీ హరి నూటొక్క జిల్లాల అందగాడు సినిమాలు చేసింది.

ఆ సినిమాలేవి అమ్మడికి అంతగా గుర్తింపు తీసుకురాలేదు. సినిమాలతో సంబంధం లేకుండా అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతుంది. గ్లామర్ షో లో అమ్మడు అదరగొట్టేస్తుంది.

సోషల్ మీడియాలో ఎంతైనా రెచ్చిపోయే అమ్మడు సినిమాల విషయానికి వస్తే మాత్రం తనకు నచ్చిన కథ మాత్రమే చేస్తానని.. సినిమాలో తన పాత్ర బాగుండాలని కబుర్లు చెబుతుంది. స్టార్ స్టేటస్ తెచ్చుకోవాలంటే అన్నిసార్లు మనకు నచ్చిన పాత్రలే చేయడం కుదరదు. ఒక్కోసారి పాత్ర నచ్చకపోయినా సరే చేయాల్సి వస్తుంది. మరి ఈ విషయం రుహాని ఎందుకు గుర్తించట్లేదో తెలియాల్సి ఉంది.

సినిమాల్లో నచ్చిన పాత్రలు వస్తేనే చేస్తానంటూ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో గ్లామర్ షో చేస్తుంది. మరి తనని ఈ యాంగిల్ లో కూడా చూపించాలని దర్శక నిర్మాతలకు హింట్ ఇస్తుందో ఏమో కానీ రుహాని శర్మ ఫోటో షూట్స్ మాత్రం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారుతున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.