Begin typing your search above and press return to search.

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోయిన్ కు క‌రోనా పాజిటివ్

By:  Tupaki Desk   |   19 Jan 2022 12:35 PM GMT
విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోయిన్ కు క‌రోనా పాజిటివ్
X
టాలీవుడ్ లో క‌రోనా క‌ల‌క‌లం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్ తో పోలిస్తే థ‌ర్డ్ వేవ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో వ‌రుస‌గా పాకిపోతోంది. దేశ వ్యాప్తంగా మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో క‌రోనా ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తోంది. దీని వ‌ల్ల పెద్ద‌గా ప్ర‌మాదం లేక‌పోయినా ఈ ద‌ఫా మెరుపు వేగంతో విస్త‌రిస్తోంది. ఎంత మంది ఎన్ని ర‌కాల జాగ్ర‌త్తలు తీసుకుంటున్నా స‌రే క‌రోనా బారిన ప‌డుతూనే వున్నారు. కోలీవుడ్ స్టార్స్ నుంచి టాలీవుడ్ స్టార్స్ వ‌ర‌కు కోవిడ్ భారిన ప‌డుతున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్ తో పాటు కోలివుడ్ కు చెందిన స్టార్స్ 13 మంది కోవిడ్ బారిన ప‌డ్డారు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ల‌క్ష్మీ మంచు, మంచు మ‌నోజ్‌, ఖుష్బూ, రాజేంద్ర ప్ర‌సాద్‌, కీర్తి సురేష్‌, శోభ‌న‌, త్రిష‌, త‌మ‌న్‌, విష్ణు విశాల్‌, విశ్వ‌క్ సేన్‌, బండ్ల గ‌ణేష్ కోవిడ్ బారిన ప‌డ్డారు. ఇప్ప‌టికే ఇందులో కొంత మంది కోలుకోగా మ‌రి కొంత మంది హొమ్ ఐసోలేష‌న్ లో వుంటూ చికిత్స పొందుతున్నారు. తాజాగా ఈ జాబితాలో మ‌రో హీరోయిన్ చేరింది.

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన `టాక్సీవాలా` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించిన ప్రియాంక జ‌వాల్క‌ర్ తాజాగా తాను కోవిడ్ బారిన ప‌డిన‌ట్టుగా సోష‌ల్ మీడియా వేదికగా వెల్ల‌డించింది. అంద‌రికి హాయ్‌.. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా తాను కోవిడ్ బారిన ప‌డ్డాన‌ని, త‌న‌కు పాజిటివ్ అని తేలింద‌ని తెలిపింది. ప్ర‌స్తుతం తాను ఐసోలేష‌న్ లో వున్నాన‌ని, డాక్ట‌ర్ల స‌ల‌హాలు పాటిస్తూ కావాల్సిన మందులు వాడుతున్నాన‌ని తెలిపింది.

ఈ సంద‌ర్భంగా గ‌త కొన్ని రోజులుగా త‌న‌తో ట‌చ్ లో వున్న వారంద‌రూ టెస్ట్ చేయించుకోవాల‌ని, అంతే కాకుండా ప్ర‌తీ ఒక్క‌రూ విధిగా మాస్క్ ధ‌రించాల‌ని, త‌ప్ప‌ని స‌రి అయితేనే బ‌య‌టికి రావాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది. ప్రియాంక జ‌వాల్క‌ర్ తాజాగా ఎస్‌.ఆర్ . క‌ల్యాణ మండ‌పం, గ‌మ‌నం చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ రెండు చిత్రాల్లో ఎస్‌. ఆర్ . క‌ల్యాణ మండ‌పం మ్యూజిక‌ల్ గా మంచి విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా హీరోయిన్ గా ప్రియాంక జ‌వాల్క‌ర్ కు మంచి క్రేజ్‌ని తెచ్చిపెట్టింది.