వీడియో : ట్రెండింగ్ ఐటెంను జిమ్ లో చేసిన నటి ప్రగతి

Mon Jan 17 2022 15:34:33 GMT+0530 (IST)

Actress Pragathi Mahavadi On Instagram

ఈమద్య కాలంలో తెగ ట్రెండ్ అవుతున్న పుష్ప పాటలకు ప్రతి ఒక్కరు ఏదో ఒక చోట ఏదో ఒక సందర్బంలో డాన్స్ లు చేస్తూనే ఉన్నారు.. చూస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ముఖ్యంగా షార్ట్ వీడియోస్.. రీల్స్ లో చూసినా కూడా పుష్ప సాంగ్స్ వినిపిస్తున్నాయి. సామి సామి.. ఊ అంటావా ఊఊ అంటావా అంటూ ప్రతి ఒక్కరు కూడా నెట్టింట వింత వింత స్టెప్పులు వేస్తూ కుమ్మేస్తున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోలు మరియు హీరోయిన్స్ కూడా ఈ పాటకు డాన్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. టీమ్ ఇండియా క్రికెటర్ లు మొదలుకుని పలు రంగాల వారు ఈ సినిమాలోని పాటలకు మరియు డైలాగ్ లకు షార్ట్ వీడియోలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా నటి ప్రగతి ఊ అంటావా ఊహూ అంటావా పాటకు డాన్స్ చేసింది.క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ప్రగతి ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈమద్య కాలంలో ఈమె సోషల్ మీడియాలో చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. తన పిల్లలతో మరియు తన సన్నిహితులతో కలిసి నెట్టింట ఈమె హడావుడి చేస్తూ ఉంది. ముక్యంగా ఈమె వర్కౌట్ చేసే వీడియోలు మరియు ఫొటోలు ఇంకా హాట్ ఫొటో షూట్ లు ఆమె పాపులారిటీని మరింతగా పెంచాయి అనడంలో సందేహం లేదు. పుష్ప సినిమా లోని ఊ అంటావా ఊఊ అంటావా పాటకు ఆమె జిమ్ లో చేసిన డాన్స్ కు ప్రతి ఒక్కరు కూడా వావ్ అంటున్నారు.

పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్ కు నెట్టింట తెగ పాపులారిటీ దక్కింది. పెద్ద ఎత్తున వ్యూస్ దక్కించుకున్న ఈ వీడియో అతి తక్కువ సమయంలోనే వంద మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకోవడం మాత్రమే కాకుండా అంతకు మించిన వ్యూస్ ను ఆ పాటకు సంబంధించిన షార్ట్ వీడియోలు మరియు కవర్ వీడియో లు దక్కించుకుంటున్నాయి. ప్రగతి చేసిన ఈ డాన్స్ కు కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్ వచ్చాయి. పాతిక వేల లైక్స్ ను ఈ వీడియో దక్కించుకుంది. మొత్తానికి ప్రగతి ఊ అంటావా ఊఊ అంటావా అంటూ వేసిన స్టెప్పు లతో మరోసారి పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సమంత ఈ ఐటెం సాంగ్ ను చేయడం వల్ల సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది అనడంలో సందేహం లేదు.