Begin typing your search above and press return to search.

సెక్స్ లేదా షారూఖ్.. ఆ రెండే సేల‌బుల్

By:  Tupaki Desk   |   29 Jan 2023 2:20 PM GMT
సెక్స్ లేదా షారూఖ్.. ఆ రెండే సేల‌బుల్
X
షారూఖ్ ఖాన్ నటించిన `పఠాన్` బాక్సాఫీస్ వద్ద ఒకదాని తర్వాత ఒకటిగా రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. 2023 మోస్ట్ అవైటెడ్ స్పై-థ్రిల్లర్ నీర‌సించిన‌ బాలీవుడ్ కి కొత్త ఊపిరులూదింది. SRK అభిమానులకు ఇది సంబ‌రాలు జ‌రుపుకునే స‌మ‌యం. పరిశ్రమ సహచరులు పఠాన్ భారీ విజయానికి ప్రశంస‌లు కురిపిస్తున్నారు.

ఇప్పుడు జూలీ వంతు. బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టి నేహా ధూపియా ప‌ఠాన్ సినిమాని వీక్షించిన అనంత‌రం ఘాటైన వ్యాఖ్య‌ను చేశారు. `సెక్స్ లేదా #షారూఖ్ ఆ రెండే సేల్ అవుతాయి!`` అనేది నేహా స్టేట్ మెంట్. నిజానికి  ఎనిమిదేళ్ల క్రితం నేహా స్వ‌యంగా ఈ స్టేట్ మెంట్ ని ఇచ్చారు. 2004లో త‌న‌ బోల్డ్ మూవీ `జూలీ` విడుదలైనప్పుడు `సెక్స్ లేదా #షారూఖ్ ఆ రెండే సేల్ అవుతాయి!`` అంటూ త‌న అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు మ‌రోసారి అదే పాత ప్రకటనను మళ్లీ రిపీట్ చేయ‌డంతో అభిమానులు దానిపై ప్ర‌తిస్పందిస్తున్నారు.

`సెక్స్ లేదా #షారూఖ్ ఆ రెండే సేల్ అవుతాయి!` ఈ వ్యాఖ్య అప్ప‌ట్లో పెను దుమారం రేపింది.  ప‌రిశ్ర‌మ‌తో పాటు ప‌రిశ్ర‌మేత‌ర వ్య‌క్తుల్లోను హాట్ టాపిక్ అయ్యింది. `పఠాన్` బాక్సాఫీస్ కలెక్షన్ ల‌పై ట్విట్టర్ లో నేహా చేసిన వ్యాఖ్యకు ప్రతిస్పందిస్తూ ఉల్లాసమైన స్పంద‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి ``దాదాపు 2 దశాబ్దాల క్రితం నేహాధూపియా `సెక్స్ లేదా #షారూఖ్ ఆ రెండే సేల్ అవుతాయి.. అది నేటికీ నిజం!`` అనే ప్రకటన తో ఖాన్ అభిమానుల హృద‌యాల‌ను ట‌చ్ చేసింది. 20 ఏళ్ల నాటి నా ప్రకటన నిజమైంది... అత‌డి కెరీర్ కాదు..కింగ్ పాలన!`` అంటూ నేహా ఎగ్జ‌యిట్ అయ్యింది. #KingKhan @iamsrk ! హ్యాష్ ట్యాగ్ ని షేర్ చేసింది.

2004లో ప్రియాంషు ఛటర్జీ -సంజయ్ కపూర్ నటించిన `జూలీ` చిత్రం విడుదలైనప్పుడు నేహా ధూపియా ఈ వ్యాఖ్యను చేసింది. ఈ చిత్రంలో నేహా సెక్స్ వర్కర్ పాత్రను పోషించింది. త‌న కెరీర్ లోనే బోల్డెస్ట్ మూవీ ఇది. ఘాటైన బెడ్ రూమ్ స‌న్నివేశాల్లో జీవించిన నేహా ధూపియా హెడ్ లైన్స్ లో నిలిచింది.

నేహా ధూపియా అప్ప‌ట్లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “జూలీకి లవ్ మేకింగ్ సీన్లు ఉన్నాయి. నా వీపందాన్ని బహిర్గతం చేసే షాట్ లు చిత్రీక‌రించారు. సెక్స్ సింబల్ ట్యాగ్ తో నేను కుషించిపోలేదు. జూలీలో ఎక్స్ పోజింగ్ చేయడం వల్ల‌నే నేను మల్లికా షెరావత్- బిపాసా బసులను వెన‌క్కి నెట్టిన‌ట్టు ప్రజలు చెబితే అది నాకు బాధ కలిగించదు. నేటి కాలంలో సెక్స్ లేదా షారూఖ్ ఖాన్ సేల‌బుల్! కాబట్టి నేను నా తదుపరి ఐదు చిత్రాలలో సెక్స్ ప్రాపర్టీగానే క‌నిపిస్తాను! అని బ‌హిరంగంగా ప్ర‌క‌టించి సంచ‌ల‌నాల‌కు తెర తీసింది. నేహా ధూపియా టాలీవుడ్ లో బాల‌కృష్ణ న‌టించిన `ప‌ర‌మవీరచ‌క్ర` చిత్రంలో న‌టించింది. ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌ర‌త్న‌ దాస‌రి నారాయ‌ణ‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.