తన వెంటపడేలా చేయడం ఒక్క నయన్ కే చెల్లింది

Tue Aug 13 2019 23:00:01 GMT+0530 (IST)

ఏదేమైనా నయనతార సుడి బాగుంది. అసలే హీరోయిన్లకు మహా అయితే ఐదేళ్ల కెరీర్ దక్కడమే గొప్ప భాగ్యంగా ఉంది. అలాంటిది టాప్ ర్యాంక్ లో దశాబ్దం పైగానే ఉండటం అంటే మాటలా. ఈ విషయంలో ఒకప్పుడు విజయశాంతి తర్వాత నయనతారనే ఉదాహరణగా చూపవచ్చు. హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా నిర్మాతలు తన వెంటపడేలా చేయడం ఒక్క నయన్ కే చెల్లింది.ఇప్పటిదాకా ఈ ఏడాదిలో నయనతార నాలుగు సినిమాలు చేసింది. మొదటిది అజిత్ విశ్వాసం. వంద కోట్లు తెచ్చింది కానీ పేరులో ఎక్కువ క్రెడిట్ అజిత్ తీసేసుకున్నాడు. అయినా కూడా నయన్ ఇమేజ్ దానికి చాలా ప్లస్ అయ్యింది. ఇక దాని తర్వాత వరసగా ఐరా-మిస్టర్ లోకల్- కొలయుత్తిర్ కాలం మూడూ టపా కట్టేసి అతి పెద్ద డిజాస్టర్లు నిలిచాయి. ఆఖరి రెండు తెలుగులో డబ్బింగ్ కూడా కాలేదు

ఇంత జరిగినా నయనతార వచ్చే మూడు సినిమాలు సౌత్ లోనే మోస్ట్ వాంటెడ్ స్టార్స్ తో కావడం గమనార్హం. అక్టోబర్ లో చిరంజీవితో మొదటిసారి నటించిన సైరా భారీ ఎత్తున విడుదల కానుండగా ఆపై దీపావళికి విజయ్ బిగిల్ రిలీజవుతుంది. ఇంకో రెండు నెలల గ్యాప్ లో రజనీకాంత్ దర్బార్ సంక్రాంతికి సందడి కి చేస్తుంది.

మొత్తం కలిపి ఈ మూడు సినిమాల బిజినెస్ సుమారుగా 500 కోట్ల దాకా ఉందంటే చిన్న విషయం కాదు. అన్నింటిలోనూ నయనే హీరోయిన్ కావడం చూస్తే తన రేంజ్ ఏంటో అర్థమవుతుంది. అందుకే ఇప్పటికీ హయ్యెస్ట్ పెయిడ్ హీరోయిన్స్ నయనతార టాప్ ర్యాంక లో కొనసాగుతోంది. తనకన్నా చిన్న వయసు హీరోలు సైతం తమకు నయనే కావాలని నిర్మాతలను డిమాండ్ చేయడం చూస్తే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది