మరో బూతు సంచలనం.. పాడు సినిమా షూట్ లో నటి అరెస్టు

Sun Aug 01 2021 18:17:31 GMT+0530 (IST)

Actress Nanditha Datta Arrested

చిత్ర పరిశ్రమకు ఏమైంది? బుద్దిగా సినిమాలు.. ఓటీటీ ఫిలింలు తీసుకోవాల్సిన వారు.. చట్ట విరుద్ధంగా బూతు సినిమాల్ని తీయటం ఏమిటి? మొన్నటికి మొన్న ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా.. ఇదే తరహా ఉదంతంలో అరెస్టు కావటం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో మరో పేరు చేరింది. తాజాగా పోలీసులు అరెస్టు చేసింది ఏకంగా నటిని కావటం సంచలనంగా మారింది.అది కూడా బూతు సినిమా షూటింగ్ లో.. ఒక నటిని తాను చెప్పినట్లుగా అశ్లీలంగా నటించాలని బలవంతం చేస్తున్న వేళలో అరెస్టు చేయటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. అదే నటికి చెందిన మరో సభ్యుడు.. వేరే చోట మరో బూతు సినిమా తీస్తూ.. అక్కడున్న నటిని తాను చెప్పినట్లుగా చండాలమైన సీన్లలో నటించాలని బెదిరిస్తున్న వేళలో అరెస్టు చేశారు.

ఈ రెండు ఉదంతాలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీశాయని చెప్పాలి. బెంగాల్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతాలు ఇప్పుడు సినీ రంగ పరిశ్రమ మీద మరిన్ని సందేహాలకు తెర తీసినట్లుగా చెప్పక తప్పదు. ఈ నటికి.. రాజ్ కుంద్రాకు ఏమైనా లింకులు ఉన్నాయా? అన్న కోణంలో కూడా విచారణ చేపట్టాలని పోలీసులు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇంతకూ అసలేమైందంటే..

ఒకప్పుడు బిజీ మోడల్ ముప్ఫై ఏళ్ల నందితా దత్తా. సినిమాలో అవకాశాల కోసం ఆమె విపరీతంగా ప్రయత్నించింది. ఇప్పుడిప్పుడే వర్ధమాన నటిగా గుర్తింపు పొందుతోంది. సరైన సినిమా అవకాశాలు రాకపోవటంతో.. బీ గ్రేడ్ మూవీలతో పాటు.. సెమీ బూతు సినిమా కంటెంట్ తో బండి లాగిస్తోంది. ఇలాంటి సినిమాలు ఎక్కువగా చూసే వారికి నాన్సీ భాబీగా సుపరిచితురాలు. ఈ వెబ్ సిరీస్ తో ఆమెకు సరికొత్త క్రేజ్ మొదలైంది. దీన్ని ఎరగా చూపుతూ పలువురికి ఆఫర్లు ఇస్తానని చెబుతూ.. దరిద్రపుగొట్టు వ్యవహారాలకు తెర తీస్తుందని చెప్పాలి.

ఆమె మాయ మాటలకు పడిపోయి.. ఆమె వలలో చిక్కుకున్న నటీమణుల పరిస్థితి దారుణంగా మారిందంటున్నారు. తాను చెప్పినట్లు చేయాలని.. లేకుంటే చంపుతామని కూడా ఆమె అనుచర వర్గం బెదిరిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆమె బాధితులు పోలీసులకు ఇచ్చిన సమాచారంతో బూతు సినిమా షూటింగ్ చేస్తున్న చోటుకు వెళ్లి మరీ.. ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవటం గమనార్హం.
బెంగాల్ రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో (నక్ టాలా.. డమ్ డమ్) ఏకకాలంలో పోలీసులు దాడి చేసి.. బలవంతంగా పాడు పని చేయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. నక్ టాలాలో ఒక మోడల్ ను నగ్నంగా మారాలని బెదిరిస్తున్న వేళలో.. పోలీసులు నందితాను అడ్డుకొని అరెస్టు చేశారు. డమ్ డమ్ లో ఆమె అనుచరుడు ఒక నటిని బెదిరిస్తూ షూట్ చేస్తున్న వైనాన్ని గుర్తించి..ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఛాన్సులు ఇస్తామని మాయమాటలు చెప్పి.. తీరా తాను చెప్పినట్లుగా నటించాలని.. లేకుంటే చంపేస్తానని కూడా బెదిరించినట్లు బాధిత మోడళ్లు వెల్లడించారు.

అంతేకాదు.. బాలీగుంజ్ లోని ఒక ప్రైవేటు స్టూడియోలో తనపై అఘాయిత్యం జరిగిందని ఒక మోడల్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. నందితతో పాటు మైనక్ ఘోష్ అనే వ్యక్తి కూడా ఈ వ్యవహారంలో కీలకభూమిక పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరి వెనుక ఏదైనా భారీ సెక్సు రాకెట్ ఉందా? అన్నది పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక ఉన్నదెవరు? అనే అంశంపై మరింత స్పష్టత కోసం విచారణ చేస్తున్నారు. బూతు సినిమాల్ని ఒక నటి స్వయంగా తీయించటం.. పలువురు మోడళ్లను బాధితులుగా మార్చటం ఇప్పుడు ఊహించని పరిణామంగా మారింది.