Begin typing your search above and press return to search.

అయ్యో పాపం మెహ్రీన్‌

By:  Tupaki Desk   |   26 May 2022 2:30 AM GMT
అయ్యో పాపం మెహ్రీన్‌
X
కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో హీరోయిన్‌ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మెహ్రీన్‌ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. మీడియం రేంజ్‌ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు ఎక్కువ సక్సెస్ లను దక్కించుకోలేక పోయింది. దాంతో కెరీర్‌ పరంగా మొదటి నుండి కూడా ఒడి దొడుకులు ఎదుర్కొంటూ వస్తుంది. అందంతో పాటు అభినయం విషయంలో పాస్ అవుతూ కెరీర్‌ ను నెట్టుకు వస్తుంది.

అదృష్టం బాగుండి ఎఫ్‌ 2 మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు కెరీర్‌ చాలా లో గా ఉన్న సమయంలో ఎఫ్‌ 3 తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎఫ్ 3 తో ఖచ్చితంగా మంచి సక్సెస్‌ ను ఈ అమ్మడు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తప్పకుండా ముందు ముందు మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ అంచనాల నడుమ రూపొందిన ఎఫ్‌ 3 సినిమా తర్వాత ఈ అమ్మడు విజయ్ హీరోగా నటించబోతున్న సినిమా లో మెహ్రీన్ నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

మెహ్రీన్‌ కు తమిళ సూపర్ స్టార్‌ విజయ్ సినిమాలో ఆఫర్ వచ్చిందే వార్తలు రావడంతో అమ్మడి దశ తిరిగి పోయిందంటూ కామెంట్స్ వచ్చాయి. విజయ్.. వంశీ పైడిపల్లి కాంబోలో రూపొందుతున్న సినిమాలో రష్మిక మందన్నా ఒక హీరోయిన్ గా నటించగా మరో హీరోయిన్‌ గా మెహ్రీన్ అంటూ వచ్చిన వార్తలు అన్నీ కూడా కేవలం పుకార్లే అని తేలిపోయింది. స్వయంగా యూనిట్‌ సభ్యులు ఆ విషయాన్ని తేల్చారు.

విజయ్‌ 66 సినిమా లో రష్మిక మాత్రమే హీరోయిన్‌ అని.. మరే హీరోయిన్‌ ను ఈ సినిమాలో ఎంపిక చేయడం లేదంటూ దిల్ రాజు టీమ్ క్లారిటీ ఇచ్చారు. దిల్‌ రాజు నిర్మించిన ఎఫ్ 3 సినిమా లో మెహ్రీన్‌ నటించడం వల్ల ఆయనే నిర్మిస్తున్న విజయ్‌ 66 లో కూడా మెహ్రీన్‌ కు అవకాశం ఇచ్చి ఉంటారు అనే పుకార్లకు చెక్‌ పెట్టారు.

ఎఫ్ 3 సినిమాపై చాలా హోప్స్ పెట్టుకుని ఎదురు చూస్తున్న మెహ్రీన్‌ కు ఆ సినిమా ఫలితం ఎలా ఉంటుంది.. ఆ తర్వాత ఆఫర్లు ఎలా ఉంటాయో అనేది చూడాలి. పుకార్లు నిజం అయ్యి విజయ్ 66 లో ఛాన్స్ వచ్చి ఉంటే తెలుగు మరియు తమిళంలో బిజీ అయ్యేది. కాని పాపం మెహ్రీన్ కు విజయ్ సినిమాలో ఆఫర్‌ లేదని తేలిపోయింది.