Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు..!

By:  Tupaki Desk   |   6 Dec 2022 1:30 AM GMT
ఆ హీరోయిన్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు..!
X
2018 ఫెమినా మిస్ ఇండియా గా నిలిచిన మీనాక్షి చౌదరి సుశాంత్ హీరోగా వచ్చిన ఇచట వాహనములు నిలుపరాదు మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అంతకుముందు మోడల్ గా చేసిన అనుభవం వల్ల ఆమె మొదటి సినిమాతోనే అదరగొట్టేసింది. ఆ మూవీ క్రేజ్ తో మాస్ మహరాజ్ రవితేజతో ఖిలాడి ఛాన్స్ అందుకుంది మీనాక్షి. ఈ మూవీ ఫెయిల్ అయినా మీనాక్షి మాత్రం ఇంప్రెస్ చేసింది. ఇక లేటెస్ట్ గా హిట్ సెకండ్ కేస్ హిట్ 2 లో నటించిన మీనాక్షి చౌదరి ఆ మూవీతో సూపర్ హిట్ అందుకుంది.

కెరీర్ లో ఫస్ట్ కమర్షియల్ హిట్ అందుకున్న మీనాక్షి ప్రస్తుతం ఆ హిట్ జోష్ ని ఎంజాయ్ చేస్తుంది. అంతేకాదు అమ్మడికి వరుస వెంట క్రేజీ ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తుంది. హిట్ 2 లో మీనాక్షి పర్ఫార్మెన్స్ కి మంచి మాక్రులు పడ్డాయి. మొదటి సినిమా ఇచట వాహనములు నిలుపరాదు, ఖిలాడి, హిట్ 2 ఇలా మూడు సినిమాల్లో తన మార్క్ నటనతో ఆకట్టుకుంటూ వచ్చిన మీనాక్షి చౌదరి టాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరోయిన్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మీనాక్షి చౌదరి కోసం ఇప్పటికే దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారని తెలుస్తుంది.

అందానికి అందం.. అభినయానికి అభినయం రెండు కలగలిసిన ముద్దుగుమ్మ మీనాక్షి రాబోయే రోజుల్లో యూత్ ఆడియన్స్ కి హాట్ ఫేవరెట్ హీరోయిన్ గా మారుతుందని అంటున్నారు. ఎలాగు మోడల్ కాబట్టి గ్లామర్ షో లో కూడా తన మార్క్ చూపించాలని ఫిక్స్ అయ్యింది మీనాక్షి. కొద్దిపాటి టాలెంట్.. ఆడియన్స్ ని మెప్పించే అందం ఉంటే దానికి కాస్త లక్ తోడైతే మాత్రం మీనాక్షి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. హిట్ 2 తర్వాత ఇప్పటికే రెండు భారీ సినిమాలకు సైన్ చేసినట్టు టాక్. వీటితో పాటుగా మరో మూవీ ఆఫర్ కూడా లైన్ లో ఉందని తెలుస్తుంది.

హిట్ మల్టీవర్స్ లో ఒక భాగమైన మీనాక్షి రాబోయే హిట్ సీరీస్ లో ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. హిట్ 2 లో అడివి శేష్ తో రొమాన్స్ కూడా అదరగొట్టిన మీనాక్షి ఇలా కూడా ఆడియన్స్ ని తన బుట్టలో వేసుకోవాలని చూస్తుంది. మీనాక్షి గ్లామర్ షో మొదలు పెడితే మాత్రం అమ్మడి క్రేజ్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. రాబోయే సినిమాలతో మీనాక్షి చౌదరి ఇమేజ్ పెరగాలని ఆమె ఫాలోవర్స్ కోరుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.