పవన్ నే కాదు మహేష్ ని కెవ్వు కేక పెట్టిస్తుంది!?

Tue Jan 24 2023 09:00:01 GMT+0530 (India Standard Time)

Actress Malaika Arora movie news

`కెవ్వు కేక ..` అంటూ `గబ్బర్ సింగ్`లో అదిరిపోయే నృత్యంతో కేక పుట్టించిన మలైకా అరోరా మరోసారి టాలీవుడ్ లో ఐటమ్ నంబర్ కోసం రెడీ అవుతోందా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ లో మలైకా స్పెషల్ నంబర్ చార్ట్ బస్టర్ గా నిలిచినా కానీ అప్పట్లో మలైకా లుక్స్ పై కొన్ని కామెంట్లు వినిపించాయి. ఏజ్ బార్ బ్యూటీకి ఆ పాట కోసం కోటి పైగానే పారితోషికం ముట్ట జెప్పారని కూడా కథనాలొచ్చాయి.అయితే దక్షిణాది వరకూ మర్చిపోయిన ఈ బ్యూటీ ఇటీవలి కాలంలో సోషల్ మీడియా రెబల్ క్వీన్ గా వెలిగిపోతోంది. తనకంటే చాలా చిన్నవాడైన యువహీరో అర్జున్ కపూర్ తో రొమాంటిక్ లైఫ్ ని ఆస్వాధిస్తున్న మలైకా నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది.

కారణం ఏదైనా కానీ మలైకాపై మాయావి త్రివిక్రమ్ కన్ను కూడా పడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తవుతోంది. ఇంతలోనే ఈ చిత్రంలో ఐటమ్ నంబర్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. మలైకా అరోరాను త్రివిక్రమ్ సంప్రదించే అవకాశం ఉందని హారిక హాసిని బృందాలు దీనిపై ఆసక్తిగానే ఉన్నాయని కూడా గుసగుసలు స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే దేనికీ అధికారికంగా కన్ఫర్మేషన్ లేదు. ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే.

మలైకా అరోరాతో ప్రత్యేక గీతం ఈ సినిమాకి ఊపు తెస్తుందని టీమ్ భావిస్తోంది. పైగా తెలుగు -తమిళం సహా హిందీలోను భారీగా రిలీజ్ చేయాలనే ఆలోచనతో త్రివిక్రమ్ టీమ్ యూనిక్ వేలో క్యాస్టింగ్ ఎంపికలు చేస్తుండడం ఆసక్తిని కలిగించింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.