నాపై ఆ నిందల వల్లే నాకు పెళ్లి కావడం లేదు

Fri May 13 2022 07:00:01 GMT+0530 (IST)

Actress Kangana Ranaut

బాలీవుడ్ హాట్ బ్యూటీ.. ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించిన  ధాకడ్   సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈనెల 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ధకడ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కంగనా గత రెండు మూడు వారాలుగా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. దేశ వ్యాప్తంగా ప్రెస్ మీట్ లు ఏర్పాటు చేయడంతో పాటు పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి ప్రమోషన్ చేస్తోంది.ఇటీవల కాలంలో వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలను చేస్తూ సక్సెస్ లను దక్కించుకుంటున్న కంగనా రనౌత్ మరోసారి  ధాకడ్   సినిమా తో ప్రేక్షకుల ముందుకు లేడీ ఓరియంటెడ్ సినిమాతోనే రాబోతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఆమె మీడియాలో పలు విషయాలతో చర్చనీయాంశంగా ఉంటుంది.

సినిమా ప్రమోషన్ లో భాగంగా బాలీవుడ్ లో కొందరు తనను టార్గెట్ చేసి తొక్కేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేసి చర్చనీయాంశం అయిన విషయం తెల్సిందే. ఈసారి తన పెళ్లి గురించి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మరోసారి చర్చనీయాంశంగా మారింది.

తాజా మీడియా సమావేశంలో ఒక రిపోర్టర్.. ధాకడ్ సినిమాలో మీ పాత్ర మగరాయుడి మాదిరిగా ఉంది. నిజంగానే మీరు నిజ జీవితంలో అలాగే ఉంటారా అంటూ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు కంగనా స్పందిస్తూ.. మీరు ఇలాంటి పుకార్లు పుట్టించి.. నిందలు వేయడం వల్లే నాకు ఇప్పటికి పెళ్లి కావడం లేదు అంటూ కాస్త ఫన్నీగా వ్యాఖ్యలు చేసింది.

నేను ఊరికే అందరితో ఫైట్ చేస్తాను అంటూ నాపై కొందరికి అభిప్రాయం ఉంది. నేను ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకునే ఫైర్ బ్రాండ్ అనే పేరును వేశారు. అయినా నేను ఇప్పటి వరకు ఎవరిని అయినా కొట్టానా చెప్పండి. నేను ఒక మంచి అమ్మాయిగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటే కొందరు తనను టార్గెట్ చేస్తున్నారు అన్నట్లుగా కంగనా ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చింది.