Begin typing your search above and press return to search.

జిగేల్ జిగేల్ గా జాన్వీ కపూర్

By:  Tupaki Desk   |   6 Feb 2023 10:48 PM GMT
జిగేల్ జిగేల్ గా జాన్వీ కపూర్
X
అలనాటి అందాలతార శ్రీదేవి కుమార్తెగా వెండితెరకు పరిచయమైంది జాన్వీ కపూర్‌. సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తోంది ఈ అమ్మడు. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులకు ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది. అలా నేటింట్లో గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ.. హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది యంగ్ అండ్ బోల్డ్ బ్యూటీ. ఈ ముద్దుగుమ్మ నెట్టింట అడుగుపెడితే ఆ రోజంతా దుమారమే. వరుస ఫొటోషూట్లతో గ్లామర్ విందు చేస్తుంటుంది.

ఈమె ఫొటోలకు కుర్రాళ్ల మతులు పోతుంటాయి. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తుంది. అలా రోజురోజుకు సరికొత్త అవతారంలో దర్శనమిస్తూ నెట్టింట రచ్చరచ్చ చేస్తూ ఉంటుంది.

తాజాగా ఓ సూపర్ వీడియో ను పోస్ట్ చేసింది. ఓ ప్రముఖ మ్యాగజైన్ ఫోటో షూట్ ఇచ్చినట్టు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇందులో జాన్వి బారు జడతో అదిరిపోయే లుక్ లో కనిపించింది. ట్రెండీ డ్రెస్ లో గ్లామర్ ఒలకబోస్తూ.. తన చురకత్తు లాంటి చూపులతో ఆకట్టుకుంది. ఇంకా చెప్పాలంటే జిగేల్ జిగేల్ గా మెరిసిపోయింది. ఇది అభిమానులను తెగ అకట్టుకుంటోంది. నెటిజన్లు.. లూకింగ్ బ్యూటిఫుల్, బోల్డ్ బ్యూటీ ఉర్ఫి జావేద్ ల ఉన్నావు, చబ్బి జాన్వీ ఇస్ బ్యాక్ అంటూ లైక్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక జాన్వీ సినిమాల విషయానికొస్తే.. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. కానీ జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ మాత్రం ఇంతవరకు ఖరారు కాలేదు. మరోవైపు ntr30 ఈ భామ టాలీవుడ్ కు పరిచయం కానుందని అంటున్నారు. అసలు జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవికి మొదట క్రేజ్ వచ్చింది తెలుగు చిత్రాలతోనే. ఆ తర్వాత శ్రీదేవి బాలీవుడ్ లో కూడా సూపర్ స్టార్ గా ఎదిగింది. ఇకపోతే రీసెంట్ గా మిలీ చిత్రంతో అలరించిన ఈ ముద్దుగమ్మ.. త్వరలోనే మిస్టర్ అండ్ మిస్ మహి, బవాల్ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించనుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.