ఫ్యాన్స్ కోసం దేవదాస్ భామ గేలం

Tue Aug 13 2019 15:35:54 GMT+0530 (IST)

Actress Ileana DCruz Bikini Pose

ఇలియానా డిక్రజ్. 2006లో దేవదాస్ సినిమాలో రామ్ తో పాటు పరిచయమైనప్పుడు తక్కువ టైంలో టాప్ హీరోయిన్ గా ఎదుగుతుందని ఎవరూ ఊహించలేదు. ఫస్ట్ మూవీనే బ్లాక్ బస్టర్ కావడం రెండో సినిమాకే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ సరసన పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్లో భాగం కావడం ఇవన్నీ అనూహ్యంగా జరిగిపోయాయి. ఇక అక్కడి నుంచి ఇలియానాకు వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఆమె నడుముకే ఫిదా అయిపోయిన యూత్ ఎందరో.తర్వాత కాలంలో జూనియర్ ఎన్టీఆర్ - రవితేజ - ప్రభాస్ - పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోలందరి సరసన చేసిన ఇల్లి బేబీ 2010 నుంచి మొదలైన ఫ్లాపుల పరంపరలో బాలీవుడ్ కు షిఫ్ట్ అయిపోయి అక్కడ బర్ఫీ రూపంలో సూపర్ హిట్ అందుకుని కొన్నాళ్ళు అక్కడ జెండా పాతింది. ఇదంతా గతం. బాయ్ ఫ్రెండ్ తో సహజీవనం వార్తలతో కొన్నాళ్ళు లైమ్ లైట్ లోకి వచ్చిన ఇలియానా గత ఏడాది రవితేజతో అమర్ అక్బర్ ఆంటోనీతో కం బ్యాక్ ఇవ్వాలని ప్రయత్నించింది. కానీ అది మరీ దారుణమైన డిజాస్టర్ గా మిగలడంతో ఇంకే ఛాయస్ లేకపోయింది.

అయినా కూడా 1 మిలియన్ పైగా ఫ్యాన్స్ ఉన్న తన ఇన్స్ టాగ్రామ్ అకౌంట్ లో ఎప్పటికప్పుడు హాట్ హాట్ అప్ డేట్స్ పెడుతూ అందరికి టచ్ లో ఉంటుంది ఇలియానా. వీటిలో బికినీ పిక్స్ కూడా ఉంటాయి. సినిమా లేకపోతే ఏంటి ఇలాంటి హాట్ షోస్ చేస్తామంటే ఫ్యాన్స్ మాత్రం వద్దంటారా. ప్రస్తుతం ఇల్లి హిందీలో పాగల్పంటి అనే సినిమా చేస్తోంది. అది తప్ప ఇంకే ఆఫర్లు చేతిలో లేవు. నవంబర్ లో ఇది విడుదల కానుంది.