లవ్ మ్యాటర్ రూమర్ గా ఉండానే ఆ హీరో.. హీరోయిన్ల ఎంగేజ్ మెంట్

Sun Dec 04 2022 11:00:01 GMT+0530 (India Standard Time)

Actress Haripriya To Soon Tie The Knot With Actor Vasishta Simha

రీల్ లైఫ్ లో హీరోగానూ విలన్ గానూ మెప్పించటం అందరికి సాధ్యం కాదు. కానీ.. అలాంటి కొందరు ఉంటారు. ఆ కోవలోకే వస్తారు కన్నడ నటుడు వశిష్ట. ఇక.. శాండల్ వుడ్ భామగా సుపరిచితురాలైన హరిప్రియ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చూడచక్కని జంట మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్ ఉందన్న రూమర్ ఇండస్ట్రీలో తరచూ వినిపిస్తూ ఉంటుంది. అయితే.. వీరిద్దరూ తమ లవ్ ఎపిసోడ్ గురించి ఎప్పుడూ ఓపెన్ అయ్యింది లేదు.ఇదిలా ఉంటే.. ఈ మధ్యనే ఫారిన్ ట్రిప్ పూర్తి చేసుకుంటూ వచ్చిన ఈ జంట బెంగళూరు ఎయిర్ పోర్టులో మీడియా కంట్లో పడటంతో.. వీరిద్దరి మధ్య రూమర్ గా ఉన్న లవ్ మ్యాటర్ నిజమేనన్న విషయం బయటకు వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా వీరి ప్రేమాయణంలో మరో అడుగు ముందుకు పడింది. ఇరు కుటుంబాలు వీరి ప్రేమను ఆమోదించటంతో అత్యంత సన్నిహితుల మధ్య వీరి ఎంగేజ్ మెంట్ కార్యక్రమం చాలా సింఫుల్ గా పూర్తి చేశారు.

పలు విజయవంతమైన చిత్రాల్లో హారోయిన్ గా నటిస్తూ భారీ ఫ్యాన్ బేస్ ఉన్న హరిప్రియ.. నటుడు వశిష్ఠలు ఇద్దరు ఒక సినిమా సందర్భంగా కలుసుకోవటం.. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారిందంటున్నారు. రీల్ లో మాదిరి వీరిద్దరి మధ్య తొలిచూపులోనే ప్రేమలో పడిపోయినట్లుగా చెబుతారు. సింఫుల్ గా జరిగిన వీరి ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. త్వరలోనే వీరి పెళ్లి డేట్ మీద క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.

మొత్తానికి సినిమా ఇండస్ట్రీకి చెందిన మరో జంట ప్రేమాయణం పెళ్లి పీటల వరకు వచ్చిందని చెప్పాలి.