Begin typing your search above and press return to search.

ఐ ల‌వ్ నాగ‌చైత‌న్య‌.. గుట్టు విప్పిన 'మ‌జిలీ' బ్యూటీ

By:  Tupaki Desk   |   29 Jan 2023 10:41 AM GMT
ఐ ల‌వ్ నాగ‌చైత‌న్య‌.. గుట్టు విప్పిన మ‌జిలీ బ్యూటీ
X
అందానికి అందం అద్భుత‌మైన న‌ట‌న .. గ్లామ‌రస్ లుక్స్ తో మెప్పించే స్పీడ్ ఉన్న యంగ్ బ్యూటీ దివ్యాంశ కౌశిక్. నాగ‌చైత‌న్య స‌ర‌స‌న మ‌జిలీ చిత్రంలో ఒక క‌థానాయిక‌గా న‌టించి యువ‌త‌రం మ‌న‌సులు దోచింది. యువ క్రికెట‌ర్ చైతో ల‌వ్ లో త‌ల‌మున‌క‌లుగా ఉండే టీనేజీ గాళ్ గా మంత్ర‌ముగ్ధుల‌ను చేసింది.

త‌న‌దైన అందం న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది దివ్యాంశ‌. ఆ త‌ర్వాత ర‌వితేజ స‌ర‌స‌న `రామారావు ఆన్ డ్యూటీ` చిత్రంలోను ఈ ఉత్త‌రాది బ్యూటీ న‌టించింది. కానీ ఫ‌లితం ఆశించినంత‌గా రాలేదు.

అయినా కెరీర్ ప‌రంగా ఈ అమ్మ‌డికి ఎలాంటి ఢోఖా లేదు. ప్ర‌స్తుతం ప‌లు తెలుగు చిత్రాల‌కు క‌మిట్ మెంట్లతో బిజీగా ఉంది. సందీప్ కిష‌న్- విజ‌య్ సేతుప‌తి న‌టిస్తున్న `మైఖేల్` క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్రంలో న‌టిస్తున్న దివ్యాంశ.. సుధీర్ వ‌ర్మ తెర‌కెక్కించ‌నున్న త‌దుప‌రి చిత్రంలోను న‌టిస్తోంద‌ని క‌థ‌నాలొచ్చాయి. హిందీలోను ది వైఫ్ (2021) అనే చిత్రంలో దివ్యాంశ న‌టించింది.

ఇక మ‌జిలీ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో దివ్యాంశ తో ప్రేమాయ‌ణం సాగించ‌డం వ‌ల్ల‌నే స‌మంత‌తో నాగ‌చైత‌న్య‌ బ్రేక‌ప్ అయ్యిందంటూ ఒక ప్ర‌చారం అప్ప‌ట్లో సాగింది. బ్రేక‌ప్ త‌ర్వాత యువ ట్యాలెంట్ ని నాగ‌చైత‌న్య పెళ్లాడేస్తున్నాడంటూ కొన్ని మీడియాల్లో క‌థనాలొచ్చాయి.

తాజాగా వీటిపై దివ్యాంశ‌ను ప్రశ్నిస్తే ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పింది. అవ‌న్నీ రూమ‌ర్లు మాత్ర‌మేనని ఖండించింది. అయితే `ఐ ల‌వ్ నాగ‌చైత‌న్య‌`... అత‌డు చాలా అంద‌గాడు! త‌న‌పై క్ర‌ష్ ఉంది!! అంటూ మ‌న‌సులో ఉన్న మాట‌ను చెప్పేసింది.

అయితే త‌న‌ను ఒక సీనియ‌ర్ న‌టుడిగా గౌర‌విస్తాన‌ని దివ్యాంశ హుందాత‌నం ప్ర‌ద‌ర్శించింది. చైత‌న్య‌తో పెళ్లి పుకార్ల‌ను నేను విన‌లేదు. ఎవ‌రి ప‌నిలో వారు బిజీగా ఉన్నామ‌ని కూడా దివ్యాంశ అంది.

మొత్తానికి అంద‌గాడైన నాగ‌చైత‌న్య‌పై త‌న‌కు క్ర‌ష్ ఉంద‌ని మాత్రం అంగీక‌రించింది. అయితే దివ్యాంశ‌పై చైకి క్ర‌ష్ ఉందా లేదా? అనేది అభిమానుల ప్ర‌శ్న‌! నాగ‌చైత‌న్య‌ క్ర‌ష్ అంతా స్టార్ డ‌మ్ ని పెంచుకోవ‌డంపైనే..! ప్ర‌స్తుత పోటీప్ర‌పంచంలో ఇది అంత సులువు కాదు.

ప్ర‌స్తుతానికి సింగిల్ స్టాట‌స్ ని చైత‌న్య కంటిన్యూ చేస్తున్నాడు. గూఢ‌చారి ఫేం శోభిత ధూళిపాల‌తో చైత‌న్య ఎఫైర్ వార్తలు వ‌చ్చినా అవ‌న్నీ నిరాధార‌మైన‌వ‌ని ప్రూవైంది.