పారిస్ ఫ్యాషన్ వీక్‌లో దీపిక బోల్డ్ అటెంప్ట్!

Wed Oct 05 2022 21:00:01 GMT+0530 (India Standard Time)

Actress Deepika Padukone latest pic

ప్యాషన్ వరల్డ్ లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే ఎలివేషన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఫ్యాషన్ ప్రియెల్ని అలరించడంలో డిజైనర్ దుస్తుల ఎంపికల్లో తనదైన మార్క్ తప్పనిసరి. తనలో ఆ క్వాలిటీనే అమ్మడిని అంతర్జాతీయ వేదికలపైనా మెరిసేలా చేసింది. న్యూ డిజైనర్స్ లో అబ్బురుపరచడం దీపిక ప్రత్యేకత. లాయిస్ విట్టన్..బంగారు ఆభరణాల కార్టియర్ లాంటి సంస్థల్ని ఎండార్స్ చేస్తుందంటే?  అమ్మడి రేంజ్ ఏంటో అద్దం పడుతోంది.తాజాగా పారిస్ ఫ్యాషన్ వీక్ లూయిస్ విట్టన్ షో లో మరోసారి తనదైన మెరుపులతో అలరించింది. దిగ్గజ ఫ్యాషన్ బ్రాండ్ తన తాజా సేకరణను ఫ్యాషన్ ప్రపంచంలోని ప్రఖ్యాత ఈవెంట్ - పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ప్రదర్శించింది. లూయిస్ విట్టన్  గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న దీపిక.. అదే బ్రాండ్‌కు చెందిన గ్రే మినీ డ్రెస్‌లో తళుకులీనింది.

బోల్డ్ మేకప్ - చిక్ యాక్సెసరీస్‌లో పదుకొణె ఆకర్షణీయంగా కనిపించింది. నల్లటి మోకాలి ఎత్తు బూట్‌లను ధరించింది.  స్వెప్-బ్యాక్ తడి జుట్టులో సెగలు పుట్టిస్తుంది. దీపిక ఎంపిక చేసుకున్న లిప్ స్టిక్ అమ్మడి రూపాన్ని పూర్తిగా మార్చేసింది. లూయిస్ విట్టన్ హౌస్ డైరెక్టర్ ఫ్రెంచ్-బెల్జియన్ డిజైనర్ నికోలస్ ఘెస్క్వియర్  దుస్తుల్ని డిజైన్ చేసారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీపిక అభిమానులు అమ్మడి అందాన్ని పొగిడేస్తూ..ముఖ్యంగా లిప్ స్టిక్  ని టార్గెట్ చేసి కామెంట్లు పోస్ట్  చేస్తున్నారు. దీపిక ఈ ఏడాది ప్రారంభంలో ఫ్యాషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైంది. అలాగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో  జ్యూరీ మెంబర్‌గానూ కంటెస్ట్ చేసింది.

అదే సమయంలో తనబ్రాండ్ దుస్తుల్ని ప్రమోట్ చేసింది. ఇక దీపిక కెరీర్ సంగతి చూస్తే బాలీవుడ్ లో ఎంత బిజీగా ఉందో చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. టాలీవుడ్ లో ప్రాజెక్ట్- కె సినిమాతో లాంచ్ అవుతుంది. ఈసినిమా సక్సస్ తర్వాత మరిన్ని తెలుగు సినిమాలకు సంతకం చేసే ఛాన్స్ ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.