ఫోటో స్టోరీ : లైగర్ భామ రచ్చ రంబోలా..!

Mon Nov 28 2022 19:00:01 GMT+0530 (India Standard Time)

Actress Ananya panday latest pic

బాలీవుడ్ హ్యాపెనింగ్ బ్యూటీ అనన్యా పాండే మొన్నటిదాకా కేవలం బాలీవుడ్ హీరోయిన్ మాత్రమే కానీ లైగర్ తో అమ్మడు పాన్ ఇండియా హీరోయిన్ అయ్యింది. విజయ్ దేవరకొండతో అనన్యా నటించిన లైగర్ మూవీ ఫలితం ఎలా ఉన్నా నేషనల్ వైడ్ గా మాత్రం బాగానే బజ్ ఏర్పరచుకుంది. ముఖ్యంగా ఆ మూవీతో సౌత్ ఆడియన్స్ కి దగ్గరైంది అనన్యా పాండే. సినిమా రిజల్ తో సంబంధం లేకుండా తనకు వచ్చిన ఈ ఐడెంటిటీ కాపాడుకోవాలని చూస్తుంది అమ్మడు.బాలీవుడ్ లో వరుస సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ లు చేస్తూ వస్తున్న అనన్యా పాండే రోజు రోజుకి క్రేజ్ డబుల్ చేసుకుంటుంది. ఇక వాటితో పాటుగా ఫోటో షూట్స్ ఆమెకి మరింత మైలేజ్ వచ్చేలా చేస్తున్నాయి. అందరి ఫోటో షూట్స్ ఒక ఎత్తు తన ఫోటో షూట్స్ ఒక ఎత్తు అనేలా అనన్యా పాండే ఫోటో షూట్ చేస్తుంది.

లేటెస్ట్ గా అమ్మడు పింక్ కలర్ డ్రెస్ లో థై షో చేస్తుంది. తన కాళ్ల అందాలని చూపిస్తూ ప్రేక్షకులను ఊరిస్తుంది అనన్యా పాండే. థై షో చేయడంలో పూజా హెగ్దేకి పోటీ వచ్చేలా ఉంది అనన్యా పాండే.

సినిమాల లెక్క ఎలా ఉన్నా ఫోటో షూట్స్ విషయం లో మాత్రం స్పెషల్ ఫోకస్ చేస్తుంది అనన్యా పాండే. అందుకే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అమ్మడి ఫోటోస్ కనిపిస్తున్నాయి. అనన్యా ఇలా షేర్ చేయడమే ఆలస్యం అలా వైరల్ అయిపోతున్నాయి. సౌత్ ఎంట్రీ చేదు జ్ఞాపకాన్ని అందించినా సరే పట్టు వదలట్లేదు అనన్యా. మరోసారి తెలుగు ఆఫర్ వస్తే చేస్తానని అంటుంది అనన్యా పాండే.  

రాబోయే రోజుల్లో బాలీవుడ్ ని ఏలాలని గట్టిగా ఫిక్స్ అయింది అనుకుంటా అందుకే అమ్మడు అన్ని చోట్ల తన ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంది. అనన్యా గ్లామర్ షోకి బాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు సౌత్ ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.