రిలీజ్ మూమెంట్లో హీరో హీరోయిన్ రొమాంటిక్ స్టిల్

Wed Jul 06 2022 06:00:02 GMT+0530 (IST)

Actors Romantic Still Before Film Release

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోలు కూడా ఇప్పుడు సౌత్ ఇండియాలో వారికంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ను క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు తెలుగు సినిమాలు తమిళ సినిమాలు హిందీలో కూడా మంచి కలెక్షన్స్ అందుకుంటూ ఉండటంతో ఇప్పుడు వారి ఫోకస్ సౌత్ ఇండస్ట్రీపై పడింది. ఇక అందులో మొదటగా రణబీర్ కపూర్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతుంది.ఇదివరకే అతను బ్రహ్మాస్త్ర సినిమాను తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రమోషన్ చేసేందుకు ప్రత్యేకంగా రాజమౌళితో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా కంటే ముందే రణబీర్ కపూర్ మరొక సినిమాను తెలుగు తమిళంలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

యష్ రాజ్ ఫిలిం ప్రొడక్షన్ లో తెరకెక్కిన షంషేరా సినిమా జూలై 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే హిందీలోనే కాకుండా ఈ సినిమాను తెలుగు తమిళంలో కూడా ఒకేసారి విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.

కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో తలకెక్కిన ఈ సినిమాపై హిందీలో కూడా పెద్దగా అంచనాలు ఏమీ లేవు. అయితే ఈ తరుణంలో హీరో హీరోయిన్ ఇద్దరు కూడా ఊహించిన విధంగా రొమాంటిక్ మూడ్లో ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వైరల్ గా మారింది. సినిమా ప్రమోషన్స్ లో ఒకవైపు బిజీగా ఉంటూనే మరొకవైపు ఘటైన ఫోటోలను విడుదల చేస్తున్నారు.

రణబీర్ కపూర్ ఒక కారుపై కూర్చుని బ్లేజర్కు బటన్స్ లేకుండా వాణి కపూర్ను చాలా దీర్ఘంగా చూస్తున్నాడు. ఇక ఆమె కూడా రొమాంటిక్ మూడ్లో బికినీలో కనిపించి స్టన్ అయ్యేలా చేసింది. వీరిద్దరికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లిస్టులో చేరిపోయింది.

ఇక ప్రస్తుతం షంషేరా సినిమా ఫై అయితే పెద్దగా అంచనాలు లేవు. ప్రమోషన్స్ అయితే బాగానే చేస్తున్నారు. ఇక రణబీర్ కపూర్ ఈ సినిమాతో సక్సెస్ అందుకొని తదుపరి సినిమాపై అంచనాలు పెంచాలని అనుకుంటున్నాడు. మరి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఇలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.