Begin typing your search above and press return to search.

రెండు పెగ్గులు వేసి నటించిన సూపర్‌ స్టార్‌

By:  Tupaki Desk   |   19 Jun 2021 4:30 AM GMT
రెండు పెగ్గులు వేసి నటించిన సూపర్‌ స్టార్‌
X
బాలీవుడ్ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ సూపర్‌ స్టార్‌ అమీర్ ఖాన్‌ తన సినిమాల పట్ల ఎంత శ్రద్ద తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పదుల కేజీల బరువు తగ్గడం.. పెరగడం నుండి మొదలుకుని లుక్‌ వరకు నెలలకు నెలలు వర్కౌట్ లు హోం వర్క్‌ లు చేసి మరీ సినిమాలు చేస్తూ ఉంటాడు. అంతగా కష్టపడుతాడు కనుక అమీర్ ఖాన్ సూపర్ స్టార్‌ అయ్యాడు అనడంలో సందేహం లేదు. వరుస సక్సెస్ లతో దూసుకు పోతున్న అమీర్ ఖాన్‌ బాలీవుడ్‌ కు వంద కోట్ల ను పరిచయం చేశాడు. ఆ తర్వాత కూడా వరుసగా వందల కోట్ల సినిమాలను కూడా అందించాడు. ఈయన నటించిన దంగల్‌ సినిమా బాహుబలి 2 ను మించి వసూళ్లు రాబట్టింది.

పాత్ర కోసం అమీర్‌ ఖాన్‌ పడే తాపత్రయం ఎలాంటిదో ఈ చిన్న సంఘటన ఆధారంగా తెలుసుకోవచ్చు. దిగ్గజ దర్శకుడు రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో రూపొందిన త్రి ఇడియట్స్ సినిమా లో అమీర్ ఖాన్ నటించాడు. ఆ సినిమాలోని ఇద్దరు స్నేహితులతో కలిసి హీరో పాత్ర తాగే సన్నివేశం ఉంటుంది. ఆ సమయంలో అమీర్ ఖాన్‌ నిజంగా తాగి యాక్టింగ్‌ చేయాలనుకున్నాడు. అందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు మరియు దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరాని కూడా అంగీకరించలేదు. నార్మల్ గా నటిస్తే చాలు అంతగా అవసరం లేదు అన్నట్లుగా సూచించాడట.

కాని అమీర్ ఖాన్‌ మాత్రం తాగి నటించాడట. రెండు పెగ్గులు తాగి ఆ తర్వాత ఆ సన్నివేశంలో అమీర్ ఖాన్ నటించాడట. ఆ సన్నివేశం చాలా బాగా పండింది. సినిమా ఎంతటి సక్సెస్ అయ్యిందో తెల్సిందే. దాదాపుగా 500 కోట్లకు పైగా వసూళ్లను అప్పట్లోనే ఈ సినిమా రాబట్టింది. ఇప్పటికి కూడా బుల్లి తెర మరియు ఓటీటీ వేదికగా ఈ సినిమాను జనాలు ఎంజాయ్‌ చేస్తున్నారు అంటే అది కేవలం అమీర్‌ ఖాన్ నటన ప్రతిభ అనడంలో సందేహం లేదు.