డ్రగ్స్ విక్రయిస్తుండగా నటుడు అరెస్ట్!

Mon Sep 21 2020 15:40:03 GMT+0530 (IST)

Actor arrested for selling drugs

కొద్ది రోజులుగా సిని పరిశ్రమలను డ్రగ్స్ రాకేట్ పట్టిపీడిస్తోంది. ఇప్పటికే సినీ ఇండస్ర్టీల్లో చాలా మంది డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు. ఇటీవల బాలీవుడ్ నటుడు సుశాంత్ మరణం కేసులోనూ ఈ డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియాను అరెస్టు కూడా చేశారు. ఆమెతోపాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. ఆ కేసు బాలీవుడ్ శాండిల్‌వుడ్‌తోపాటు టాలీవుడ్‌నూ వెంటాడుతోంది.ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విస్తృతంగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఈ కేసు అటు కన్నడ పరిశ్రమలోనూ ప్రకంపనలు రేపుతోంది. ఇద్దరు స్టార్ హీరోయిన్లను అరెస్టు చేశారు. వీరితోపాటు మరో ముగ్గురు అర్టిస్టులు మరికొంత మంది డ్రగ్స్ సరఫరా చేసే వారిని అదుపులోకి తీసుకున్నారు. 15 మందికి ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు.

బెంగళూర్ పోలీసులు తమదైన శైలిలో కేసులు విచారిస్తున్నారు. దీంతో కేసులో రోజుకొకరి ప్రముఖుల పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. వారిని పిలిపించి విచారణలు చేస్తూనే ఉన్నారు. అయితే..ఈ కేసు ఇంత సీరియస్‌గా నడుస్తుండగా తాజాగా ఓ కన్నడ నటుడు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడడం కలకలం రేపింది.

మంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ వికాశ్ కుమార్ వివరాలు వెల్లడించారు. తాజాగా కన్నడ డ్రగ్స్ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వీరిలో నటుడు కొరియోగ్రాఫర్ కిశోర్ అమన్ శెట్టి కూడా ఉన్నారని తెలిపారు. ‘ఎండీఎంఏ’ డ్రగ్స్‌ను విక్రయించేందుకు ప్రతయ్నిస్తుండగా పట్టుకున్నట్లు వివరించారు. బైక్‌పై వెళ్తుండగా వీరిద్దరినీ పట్టుకున్నామని.. రెండో వ్యక్తి అఖిల్ నౌషీల్‌గా గుర్తించామని తెలిపారు. వీరికి ముంబై నుంచి డ్రగ్స్ వచ్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ఆ డ్రగ్స్ విలువ లక్ష రూపాయలు ఉంటుందని తెలిపారు.