Begin typing your search above and press return to search.

వైరల్ అవుతున్న యాక్టర్ రవిబాబు - సెక్యూరిటీల ఫన్నీ వీడియో!

By:  Tupaki Desk   |   6 Jun 2020 11:50 AM GMT
వైరల్ అవుతున్న యాక్టర్ రవిబాబు - సెక్యూరిటీల ఫన్నీ వీడియో!
X
తెలుగు ఇండస్ట్రీలో యాక్టర్ రవిబాబు అంటే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక నటుడిగా ఆయన కెరీర్ ప్రారంభించి డైరెక్టర్ గా ప్రస్తుతం తక్కువ బడ్జెట్ లో సినిమాలు రూపొందిస్తున్నాడు. అయితే రవిబాబు ఏం చేసినా అది ప్రత్యేకంగానే నిలుస్తుంది. యాక్టర్ నుండి డైరెక్టర్ గా మారిన తర్వాత సినిమాలతో ఆయన మార్క్ కామెడీ సృష్టిస్తున్నాడు. అయితే డైరెక్టర్ గానే కాదు రవిబాబు వ్యక్తిగతంగా కూడా కామెడీ బాగా పండించగలడని ఎంతమందికి తెలుసు. బయట ఆయన వ్యవహార శైలి ఎంతో వినోదాత్మకంగా ఉంటుంది. సినిమాలలో తప్ప రవిబాబు బయట ఎక్కువగా కనిపించడు. ఎల్లప్పుడూ తన కొత్త సినిమా ప్రాజెక్టుల గురించి వర్క్ చేస్తూ ఉంటాడట. అయితే లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం దేశమంతా ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఎవరిళ్ళకు వారు పరిమితమై ఎవరి పనులను వారు చేసుకుంటున్నారు.

అయితే ఇటీవల రవిబాబు మాస్క్ ధరించి సూపర్ మార్కెట్ కి వెళ్ళాడట. మరి వెళ్లిన ఆయన ఊరికే ఉంటాడా.. సూపర్ మార్కెట్ సెక్యూరిటీతో కలిసి తన మార్క్ కామెడీ పండించాడు. ప్రస్తుతం రవిబాబు - సెక్యూరిటీల కామెడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు రవిబాబు సూపర్ మార్కెట్ సెక్యూరిటీతో కలిసి ఏం చేసాడంటే.. సూపర్ మార్కెట్ ఎంట్రన్స్ వద్ద రవిబాబు లోపలికి వెళుతుండగా ఆయనను సెక్యూరిటీ గార్డ్ ఆపి థర్మల్ స్కానర్ తో చెక్ చేసాడు. ఆ వెంటనే రవిబాబు.. సెక్యూరిటీ గార్డ్ చెకింగ్ ముగియగానే.. ఉండు నేను కూడా నిన్ను చెక్ చేస్తాను అని.. జేబులో నుండి థర్మల్ స్కానర్ తీసి సెక్యూరిటీని చెక్ చేసి.. అంతా ఓకే అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. ఆ వీడియో చూస్తే ఎవరికైనా నవ్వు రావాల్సిందే. అలా ఉంది మరి రవిబాబు వ్యవహార శైలి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో మోస్ట్ ఫన్నీ వీడియోగా వైరల్ అవుతోంది. అబ్బో రవిబాబులో ఇలాంటి కామెడీ యాంగిల్ కూడా ఉందే.. అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.