సినిమానే జీవితం అంటూ రాజశేఖర్ ఎమోషనల్

Sun May 22 2022 17:00:01 GMT+0530 (IST)

Actor Rajasekhar In Twitter

హీరో రాజశేఖర్ ఆయన కుమార్తె శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించగా జీవిత దర్శకత్వం వహించిన శేఖర్ థియేటర్లలోకి విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా చట్టపరమైన చిక్కుల్లో పడడంతో ఈ రోజు థియేటర్లలో ఆడలేదు. దీనిపై తాజాగా రాజశేఖర్ సోషల్ మీడియాల్లో ఎమోషనల్ నోట్ ని రాసారు.``సినిమాయే మా జీవితం.. నాకు నా కుటుంబానికి ఇదే లోకం. `శేఖర్` సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు ఎంతగానో శ్రమించాం. కానీ కొందరు మాపై ఉద్ధేశపూర్వకంగా కక్ష కట్టి మా సినిమాని థియేటర్లలో ఆడకుండా ఈరోజు నిలువరించారు. సినిమాయే జీవితం. ఈ సినిమాపై ఎన్నో ఆశలు ఆకాంక్షలు ఉన్నాయి. సమస్యల్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఏదోలా మూవీ తిరిగి థియేటర్లలో ప్రారంభమవుతుందని ఆశిస్తున్నాను..`` అని ఎమోషనల్ గా ట్వీట్ చేసారు.