30 ఇయర్స్ ఫృథ్వీకి 'భార్య' షాక్..

Sat Oct 01 2022 12:08:18 GMT+0530 (India Standard Time)

Actor Prithvi to pay Alimony to Wife

సినిమా నటుల సంసారాలు ఎక్కువ కాలం నిలబడవు.. సమంత-నాగాచైతన్య నుంచి మొదలుపెడితే ఇటీవల మంచు మనోజ్ తోపాటు క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకూ వారి ఇగోలు సర్దుకుపోని తత్వాలు సహా ఎన్నో బయట 'ఆకర్షణలు' కూడా వారి బంధాన్ని కలకాలం నిలవనివ్వవు. ఆ సుఖం కోసం.. ఎఫైర్ల కోసం ఇలా సినీ ప్రముఖులు విడాకులు తీసుకుంటారు.  అలా సామరస్యంగా విడిపోతే పర్లేదు. కానీ కోర్టులకు ఎక్కితేనే అసలు పంచాయితీ మొదలవుతుంది.టాలీవుడ్ లో 30 ఇయర్స్  అంటూ ఫేమస్ అయిన కమెడియన్ పృథ్వీరాజ్ గురించి అందరికీ తెలిసిందే.. ఆయన తన భార్యను వదిలేసి వేరేవాళ్లతో సహజీవనం చేస్తున్నట్టు బయట టాక్. కన్ఫమ్ గా తెలియదు కానీ భార్యతో విడిపోయాడు. ఆమె భరణం కోసం కోర్టుకు ఎక్కింది. తాజాగా తీర్పు వచ్చింది. ఫృథ్వీ రాజ్ కు అదిరిపోయే షాక్ తగిలింది.

నటుడు పృథ్వీరాజ్ తన భార్య శ్రీలక్ష్మీకి ప్రతీనెల రూ.8 లక్షలు భరణం చెల్లించాలని విజయవాడ 14వ అదనపు జిల్లా ఫ్యామిలీ కోర్టు తీర్పునిచ్చింది. విజయవాడకు చెందిన శ్రీలక్ష్మీకి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన బాలిరెడ్డి ఫృథ్వీరాజ్ తో 1984లో వివాహమైంది. వారికి ఒక కుమార్తె కుమారుడు ఉన్నారు.

ఫృథ్వీరాజ్ వివాహం అయ్యాక విజయవాడలోని భార్య పుట్టింట్లో ఉంటూ చెన్నై వెళ్లి సినిమాల్లో నటించేవాడు. ఆ ఖర్చులన్నీ భార్య తల్లిదండ్రులే భరించేవారు. డబ్బుల కోసం తరచూ తనను వేధించేవాడని ఫృథ్వీరాజ్ భార్య శ్రీలక్ష్మీ కోర్టుకు తెలిపింది.

ఈ క్రమంలోనే 2016 ఏప్రిల్ 5న ఇంట్లో నుంచి ఫృథ్వీరాజ్ తనను గెంటేశాడని.. పుట్టింటికి వచ్చి ఆయనపై ఫిర్యాదు చేశానని శ్రీలక్ష్మీ తెలిపింది. తన భర్త సినిమాలు టీవీ సీరియళ్ల ద్వారా నెలకు రూ.30 లక్షలు సంపాదిస్తున్నాడని.. అతడి నుంచి భరణం ఇప్పించాలని 2017 జనవరి 10న కోర్టులో కేసు దాఖలు చేసింది. కేసు పరిశీలించిన కోర్టు తాజాగా ఫృథ్వీరాజ్ కు నెలకు రూ.8లక్షల చొప్పున భార్యకు నెలనెలా భరణం చెల్లించాలని తీర్పునిచ్చింది. ఆమె కేసు దాఖలు చేసినప్పటి నుంచి ఈ మొత్తం ఇవ్వాలని ఆదేశించింది. ప్రతీ నెల 10వ తేదీ నాటికి ఆమెకు భరణం చెల్లించాలని తీర్పునిచ్చింది.

సినిమాల్లో ఫృథ్వీ ఎంత సంపాదిస్తున్నాడో తెలియదు కానీ.. ఇప్పుడు నెలకు రూ.8లక్షల భరణం అంటే ఫృథ్వీరాజ్ కు షాకింగ్ కిందే లెక్క. మరి అంత చెల్లిస్తాడా? పైకోర్టుకు వెళతాడా? అన్నది వేచిచూడాలి.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.